రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధిని ప్రజలకు చేరువచేసే బాధ్యత సర్పంచులదేనని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. గ్రామ పరిపాలనలో సర్పంచ్‌ల పనితీరే కీలకమన్నారు. విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం నిమ్రా కాలేజీలో నిర్వహించిన సర్పంచ్‌ల శిక్షణా కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలను సద్వినియోగ పరచాలని ఆదేశించారు.
ప్రజాప్రతినిధులుగా ఎదిగేందుకు గ్రామ సర్పంచ్ పదవి తొలిమెట్టని మంత్రి అన్నారు. సమర్థ నాయకత్వంతో గ్రామాలను అభివృద్ధి పథంలో నిలపాలని అందుకు అవసరమైన శిక్షణ, సదుపాయాలను ప్రభుత్వం అందిస్తుందని స్పష్టం చేశారు. కార్యక్రమానికి మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, ఏపీఎస్‌ఐఆర్డీ డైరెక్టర్ మురళి, జిల్లా కలెక్టర్ జె.నివాస్, విజయవాడ డివిజన్ పరిధిలోని గ్రామ సర్పంచ్‌లు హాజరయ్యారు.
ఇదీ చదవండి..
గనులను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడంలో ఆంతర్యమేంటి..?: కాలవ