ఆర్ఎస్ఎస్ ఏపీ కార్యాలయం హైందవి నిలయంలో.. స్వయం సేవక్ సంఘ్ ముఖ్యులతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి సమావేశం కానున్నారు. రెండు రోజుల పర్యటన కోసం ఆయన విజయవాడ చేరుకున్నారు. భాజపా నేతలతో కలిసి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు.. గన్నవరం విమానాశ్రయం వద్ద కిషన్‌రెడ్డికి స్వాగతం పలికారు. ఈరోజు ఉదయం అమ్మవారిని దర్శించుకున్న తర్వాత భాజపా రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభిస్తారు.
ఇదీ చదవండి: 'చెడు మీద మంచి సాధించిన విజయానికి ప్రతీకే దసరా'