ETV Bharat / city

డేటా సైన్స్​ వర్క్​షాప్​కు వర్చువల్​గా హాజరైన విద్యాశాఖ మంత్రి - adimulapu suresh latest news

సమీప భవిష్యత్తులో డేటా అనలిటిక్స్ కీలకంగా మారనుందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్​ అన్నారు. డేటా సైన్స్, అడ్వాన్స్ కంప్యూటింగ్ అంశంపై నిర్వహించిన జాతీయ స్థాయి వర్క్​షాప్​కు వర్చువల్​గా మంత్రి హాజరయ్యారు.

Minister of Education
విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్​
author img

By

Published : Mar 13, 2021, 7:22 PM IST

విట్ ఏపీ ఆధ్వర్యంలో డేటా సైన్స్, అడ్వాన్స్ కంప్యూటింగ్ అంశంపై జాతీయ స్థాయిలో వర్క్​షాప్​ జరిగింది. ఈ కార్యక్రమానికి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్​ వర్చువల్​గా హాజరయ్యారు. సమీప భవిష్యత్తులో డేటా అనలిటిక్స్ కీలకంగా మారనుందని ఆయన వ్యాఖ్యానించారు. డేటా సైన్స్​ ఆధారిత రంగాల్లో నైపుణ్యం సంపాదించేలా ఆ తరహా అంశాలపై రాష్ట్రంలోనూ దృష్టి పెడతామని మంత్రి వెల్లడించారు.

21వ శతాబ్ది ఉపాధి అవకాశాలను మెరుగుపర్చుకునేలా కొత్త అంశాలపై యువత నైపుణ్యం సంపాదించాలని మంత్రి సూచించారు. డేటా అనలిటిక్స్, అడ్వాన్స్​ కంప్యూటింగ్, డేటా ఇంజినీరింగ్, బిజినెస్ అనలిటిక్స్, హెచ్ఆర్, సోషల్ మీడియా, మార్కెటింగ్, రిస్క్ అండ్ కంప్లైయన్స్, సప్లై చైన్ అనలిటిక్స్ రంగాలలో విస్తృతమైన అవకాశాలు ఉన్నట్టు మంత్రి తెలిపారు.

ఇదీ చదవండి: కలెక్టర్​​పై వైకాపా ఎమ్మెల్యే కేతిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.