రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ సతీసమేతంగా కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో దుర్గ గుడి అధికారులు, అర్చకులు మంత్రికి స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం మంత్రి దంపతులకు ఆలయ వేద పండితులు దివ్యాశీర్వచనాలు అందజేశారు. అనంతరం ఆలయ అధికారులు.. అమ్మవారి చిత్రపటంతో పాటు దుర్గమ్మ ప్రసాదాన్ని మంత్రికి అందజేశారు.
ఇదీ చదవండి...