జీఎస్టీ కౌన్సిల్ భేటీలో రాష్ట్ర అంశాలను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రస్తావించారు. 2 శాతం అదనపు రుణం సమీకరణకు అనుమతి కోరారు. 2019-20 ఏడాది వృద్ధి రేటు 3 శాతంగా పరిగణించాలని విజ్ఞప్తి చేశారు. జీఎస్టీ పరిహారం బకాయిలు రాష్ట్రాలకు ముందుగా చెల్లించాలని కేంద్రాన్ని బుగ్గన విజ్ఞప్తి చేశారు.
సెస్, సర్‌ఛార్జిల మొత్తం కేంద్ర ఖాతాకు జమ చేశారని.. సామూహిక నిధుల నుంచి రాష్ట్రాలకు ఇచ్చింది 2018-19లో రూ.18 లక్షల కోట్లేనని బుగ్గన తెలిపారు. 2019-20లో ఆ మొత్తం రూ.15.5 లక్షలకు తగ్గిందని రాష్ట్ర మంత్రి వివరించారు. ఈ వ్యత్యాసాలు సవరించి రాష్ట్రాలకు ఎక్కువగా నిధులు ఇవ్వాలన్నారు.
ఇదీ చదవండి: