రాష్ట్రంలో ఆలయాలపై జరుగుతున్న దాడులపై చర్చించేందుకు మతసామరస్య కమిటీ సమావేశం జరిగింది. అన్ని మతాల ప్రతినిధులతో కమిటీలు వేసి, పర్యవేక్షణ చేయాలని మంత్రుల సమావేశం నిర్ణయించింది. వైకాపా చేస్తున్న సంక్షేమాన్ని అడ్డుకోవడానికి కొన్ని దుష్టశక్తులు పని చేస్తున్నాయని మంత్రి బొత్స మండిపడ్డారు. ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని పన్నాగం పన్నారని దుయ్యబట్టారు. జన సంచారం లేని ఆలయాలపై దాడులు చేసి... విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మతసామరస్య కమిటీ సమావేశంలో మంత్రులు వెల్లంపల్లి, సుచరిత తదితరులు పాల్గొన్నారు.
ఇదీచదవండి
జనవరి 11న అమ్మ ఒడి రెండో విడత కార్యక్రమం ప్రారంభించనున్న సీఎం