ETV Bharat / city

TOURISM REOPEN: రేపు పర్యాటక ప్రాంతాలు పునఃప్రారంభం - పర్యటక ప్రాంతాలపై సమీక్ష నిర్వహించిన అవంతి శ్రీనివాస్

రాష్ట్రంలో ఉన్న పర్యాటక ప్రాజెక్టులపై ఆ శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆంక్షలు ఎత్తివేయనున్నందున పర్యాటకులను ఆకట్టుకునేలా ప్రాజెక్టులు రూపొందించాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు.

అవంతి శ్రీనివాస్
అవంతి శ్రీనివాస్
author img

By

Published : Jun 23, 2021, 4:07 PM IST

Updated : Jun 23, 2021, 8:11 PM IST

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పర్యాటక ప్రాజెక్టులపై ఆ శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఒక్కొక్క రాష్ట్రంలోనూ రెండో విడత అన్​లాక్ ప్రక్రియ ప్రారంభం కావటంతో పాటు.. ఆంక్షలు ఎత్తివేస్తుండటంతో పర్యాటకులను ఆకట్టుకునేందుకు ప్రాజెక్టులను ప్రారంభించాల్సిందిగా మంత్రి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోనూ రెండో విడత అన్​లాక్ ప్రక్రియ ప్రారంభమైనందున రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలన్నీ రేపటినుంచి ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్ర పర్యాటక ప్రాంతాల ప్రాముఖ్యతను చాటి చేప్పే విధంగా దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో రోడ్ షోలు నిర్వహించాల్సిందిగా సూచనలు ఇచ్చారు. విశాఖపట్నం ఋషికొండలోని పర్యాటకశాఖ బ్లూబే హోటల్​ను రూ.164 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్టు మంత్రి స్పష్టం చేశారు. మరోవైపు ఈ నెల 24 తేదీన బోటు ఆపరేటర్లతోనూ సమావేశం కావాలని పర్యాటకశాఖ నిర్ణయించింది. వివిధ చోట్ల బోట్ ఆపరేషన్లను కూడా మొదలుపెడతామని మంత్రి వెల్లడించారు. బోటు ప్రమాదాలు జరగకుండా కమాండ్ కంట్రోల్ ద్వారా నియంత్రిస్తామని మంత్రి తెలిపారు. ఈ అంశంపై రేపు బోటు ఆపరేటర్లతో విజయవాడలో సమావేశం నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు.

కొవిడ్ కారణంగా పర్యాటకపరమైన ఆదాయం నిలిచిపోయినప్పటికీ కోవిడ్ కేర్ కేంద్రాలకు ఆహార సరఫరా ద్వారా ఏపీటీడీసీ ఈ ఏడాది రూ.28 కోట్లను ఆర్జించిందన్నారు. మరోవైపు బంగ్లాదేశ్ నుంచి తీరానికి కొట్టుకు వచ్చిన ఓడను ఫ్లోటింగ్ రెస్టారెంట్​గా మార్చేందుకు అనుమతులు తీసుకున్నామని త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు. ప్రభుత్వం మద్య పానానికి వ్యతిరేకమైన పర్యాటక ప్రాంతాలకు విదేశీయులను ఆకర్షించేందుకు వీలుగా ఖరీదైన మద్యం బ్రాండ్లను అందుబాటులో ఉంచేందుకు 33 బార్లకు అనుమతిచ్చినట్టు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో 7 ఫైవ్ స్టార్ హోటళ్లను ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు.

సముద్రంలో కలుస్తున్న నీటిని వాడుకుంటే తప్పేంటి?...

సాగునీటి ప్రాజెక్టులు, నీటి పంపకాలపై ఏపీని తిడితే తెలంగాణాలో ఓట్లు పడవని రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. సముద్రంలో కలుస్తూ వృథా అవుతున్న నీటిని వాడుకుంటే తప్పు ఏంటని మంత్రి ప్రశ్నించారు. ఇలాంటి ఘర్షణలు వస్తాయనే చాలా మంది రాష్ట్ర విభజనను వ్యతిరేకించారని మంత్రి అన్నారు. రాజకీయాల కోసం మళ్లీ ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టటం సరికాదని మంత్రి అవంతి వ్యాఖ్యానించారు.

విభజన తర్వాత రెండు రాష్ట్రాలూ ఎలా ఉన్నాయో ప్రజలకు తెలుసునని అన్నారు. మరోవైపు సరైన సమయంలో విశాఖకు పాలనా రాజధాని తరలివెళ్తుందని స్పష్టం చేశారు. ప్రాంతాల మధ్య విద్వేషాలు రాకూడదనే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నారని వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయి క్రీడామైదానాల్ని విశాఖ, అమరావతి, కర్నూలు నగరాల్లో ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఒలింపిక్స్ లో పాల్గొనేందుకు ఏపీ నుంచి వెళ్తున్న ముగ్గురు క్రీడాకారులు పీవీ సింధు, రజనీ, సాత్విక్ సాయిరాజ్ లకు 5 లక్షల ప్రోత్సాహకం ఇస్తామన్నారు. పీవీ సింధూకు స్థలం కేటాయింపులో రాజకీయాలు అనవసరమని మంత్రి వ్యాఖ్యానించారు. కరణం మల్లీశ్వరిని దిల్లీ ప్రభుత్వం స్పోర్ట్స్ యూనివర్సిటీ వీసీగా నియమించడం సంతోషదాయకమన్నారు.

ఇదీ చదవండి:

cm jagan: మహిళా భద్రతపై ప్రత్యేక దృష్టిపెట్టాలి: సీఎం జగన్​

Last Updated : Jun 23, 2021, 8:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.