ETV Bharat / city

ఒక్క ప్రాణం పోకుండా సహాయక చర్యలు చేపట్టాం: మంత్రి అంబటి రాంబాబు

Ambati Rambabu: భారీగా వరదలు వచ్చినా.. ఒక్క ప్రాణం కూడా పోకుండా గోదావరి వరదల్లో అధికారులు, సిబ్బంది.. అద్భుతంగా సహాయక కార్యక్రమాలు చేపట్టారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. బాధితులకు పునరావాసాలు కల్పించే విషయంలో.. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. 30 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చినా.. పోలవరం డ్యాం దెబ్బతినకుండా.. యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కాఫర్ డ్యాం ఎత్తు మీటర్ పెంచామన్నారు.

minister ambati rambabu speaks over flood relief measures
ఒక్క ప్రాణం పోకుండా సహాయక చర్యలు చేపట్టాం: మంత్రి అంబటి రాంబాబు
author img

By

Published : Jul 18, 2022, 5:43 PM IST

ఒక్క ప్రాణం పోకుండా సహాయక చర్యలు చేపట్టాం: మంత్రి అంబటి రాంబాబు

Ambati Rambabu: భారీ వరదలు వచ్చినా.. ఒక్క ప్రాణం కూడా పోకుండా గోదావరి వరదల్లో అధికారులు సహాయక కార్యక్రమాలు సమర్ధంగా చేపట్టారని.. జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అధికారులు, వాలంటీర్ల సహాకారంతో.. సహాయక చర్యలు చేపట్టామని, పునరావాస చర్యలు విషయంలో ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందన్నారు. 28లక్షల క్యూసెక్కుల వరద లక్ష్యంతో గతంలో కాఫర్ డ్యాం ను నిర్మించగా.. పోలవరం వద్ద 27 లక్షల క్యూసెక్కుల వరద ప్రవహించడంతో తామంతా భయపడ్డామని, 30 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చినా డ్యాం దెబ్బకుండా ఉండేలా యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

ఎత్తు పెంచాం.. పోలవరం ప్రాజెక్టు దెబ్బతినకుండా కాఫర్ డ్యాం ఎత్తు మరో మీటర్ పెంచామన్నారు. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నా.. తెదేపా నేతలు సహా కొందరు అవాస్తవాలు ప్రచారం చేస్తూ రెచ్చగొడుతున్నారన్నారు. ఆరుగురు కలెక్టర్లు నిరంతరం అందుబాటులో ఉంటూ.. సహాయక చర్యలను చేపట్టారని, గోదావరి వరదల్లో రాజకీయం చేస్తే ప్రయోజనం ఉండదని చంద్రబాబుకు సూచించారు.

దేవినేనిపై మండిపాటు.. తనపై దేవినేని ఉమా చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. 2018 నాటికి పోలవరం పూర్తి చేస్తామని దేవినేని ఉమా గతంలో ప్రకటించగా.. గడువు నాటికి ఎందుకు పూర్తి చేయలేదో సమాధానం చెప్పాలన్నారు. పోలవరం నిర్మాణం పూర్తి చేసేందుకు అహర్నిశలు చిత్తశుద్దితో పని చేస్తున్నామన్నారు.

తెదేపా, దేవినేని ఉమా అసమర్థత వల్ల పోలవరం వద్ద లోయర్ కాఫర్ డ్యాం కొట్టుకు పోయిందన్నారు. ‍‌పోలవరంపై బహిరంగ చర్చకు తాము సిద్దమేనన్నారు. డయాఫ్రం వాల్ కొట్టుకుపోవడానికి ముమ్మాటికీ తెదేపా ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. ఇష్టానుసారంగా మాట్లాడవద్దని దేవినేనిపై మండిపడ్డారు.

ఇవీ చూడండి:

ఆ మూడు రోజులు.. వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.