దావోస్ వేదికగా జరగనున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు.. ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలోని ఏపీ బృందం హాజరుకానుంది. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, గుడివాడ అమర్నాథ్, ఎంపీ మిథున్ రెడ్డి, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు సదస్సులో పాల్గొననున్నారు. ఈ సదస్సులో వివిధ రంగాల్లో వాణిజ్యం, అధునాతన నమూనాలు, గ్లోబల్ నెట్‌వర్క్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎంఎస్ఎమ్ఈలను మరింత బలోపేతం చేయడం, నైపుణ్యం/రీస్కిల్లింగ్ వర్క్‌ఫోర్స్, తయారీ, గ్లోబల్ పోర్ట్-నేతృత్వంలోని అభివృద్ధి, ఎగుమతులను ప్రోత్సహించడం వంటి అంశాల్లో ఏపీ భాగస్వామ్యం ఉంటుందని ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. 18 అంశాల్లో ఏపీ ప్రదర్శన నిర్వహించనున్నట్లు మంత్రి వివరించారు.
ఏపీ ప్రభుత్వ విధానాలను.. ఏపీలోని అవకాశాలను వరల్డ్ ఎకనమిక్ ఫోరం వేదికగా షో కేస్ చేస్తామని మంత్రి వెల్లడించారు. సదస్సు ముగిసిన తర్వాత.. పెట్టుబడులు తెచ్చేలా కృషి చేస్తామన్నారు. పీపుల్-ప్రోగ్రెస్-పాజిబులిటీస్ అనే థీమ్ తో దావోస్ సమావేశానికి వెళ్తున్నామన్నారు. అధికార వికేంద్రీకరణకు సంబంధించిన అంశాన్ని దావోస్ వేదికగా వివరిస్తామన్నారు. ఏపీకి అతి పెద్ద తీరం ఉందని.. వనరులు ఉన్నాయని షో కేస్ చేస్తామన్నారు. సుమారు 30 మల్టీ నేషనల్ కంపెనీలతో భేటీ కాబోతున్నట్లు వివరించారు. వ్యవసాయ రంగం మొదలుకుని వివిధ రంగాలకు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను వివరిస్తామని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు.
ఇదీ చదవండి