ETV Bharat / city

రేపు పవరింగ్​ ఆంధ్రప్రదేశ్ సదస్సు

హరిత ఇంధన రంగంలో పెట్టుబడులను ఆహ్వానించడానికి 'పవరింగ్ ఆంధ్రప్రదేశ్ - ఎనర్జీ ఇన్నోవేషన్స్ 2019' పేరిట అంతర్జాతీయ సదస్సు నిర్వహించనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నెల 5, 6 న విజయవడ నోవాటెల్​ హోటల్ లో ఈ కార్యక్రమం జరగనుంది.

రేపు పవరింగ్​ ఆంధ్రప్రదేశ్ సదస్సు
author img

By

Published : Feb 4, 2019, 9:00 PM IST

రాష్ట్రంలో హరిత ఇంధన సామర్థ్యాన్ని రెట్టింపు చేసే లక్ష్యంతో ఇంధన శాఖ ముందుకెళ్తోంది. ఈ రంగంలో పెట్టుబడులను ఆహ్వానించడానికి 'పవరింగ్ ఆంధ్రప్రదేశ్ - ఎనర్జీ ఇన్నోవేషన్స్ 2019' పేరిట అంతర్జాతీయ సదస్సు నిర్వహించనుంది. ఈ నెల 5, 6 న విజయవడ నోవాటెల్​ హోటల్ లో ఈ కార్యక్రమం జరగనుంది.
ఇంధన రంగంలో వస్తున్న వినూత్న ఆవిష్కరణలను అందిపుచ్చుకోవటంతో పాటు, మన వనరుల్ని ప్రపంచానికి పరిచయం చేయడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ డాల్​బర్గ్, భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ), ఇండియన్​ ఛాంబర్​ ఆఫ్ కామర్స్, టెరీ స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సదస్సులో ముఖ్యమంత్రి కీలక ఉపన్యాసం చేయనున్నారు.
హరిత ఇంధన రంగంలో అధునాతన టెక్నాలజీ, అంతర్జాతీయంగా ఉత్తమ విధానాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. విద్యుత్​ వాహన రవాణా పైనా చర్చిస్తారు. 2023 నాటికి 10 లక్షల కార్లు వినియోగించే లక్ష్యంతో ఏపీలో ప్రణాళికలు రూపొందించేలా ఈ సదస్సు ప్రతిపాదించనుంది.
రాయలసీమ, కోస్తాంధ్రలో 1816 కోట్లతో 3 వేల మెగావాట్ల పార్కుతో పాటు, వెయ్యి మెగావాట్ల పవన విద్యుత్​ పాంట్లు ఏర్పాటు చేయనున్నారు.
2019 చివరికి 10 వేల మెగావాట్లు...2023 నాటికి 18 వేల మెగావాట్ల పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ స్థాయి పునరుత్పాదక ఇంధనం తయారైతే ఏటా 252 లక్షల మెట్రిక్ టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

undefined

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.