ETV Bharat / politics

'ఎక్స్​' వేదికగా అభిమానుల సందేహాలు - అలాగైతే రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానన్న కేటీఆర్ - KTR FIRES ON CM REVANTH REDDY

కార్యకర్తల ఆకాంక్షల మేరకు రాష్ట్రవ్యాప్త పాదయాత్ర చేస్తానన్న బీఆర్ఎస్ నేత కేటీఆర్ - కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని మండిపాటు

BRS Leader KTR to Start Padayatra in Telangana
BRS Leader KTR to Start Padayatra in Telangana (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 1, 2024, 3:58 PM IST

BRS Leader KTR to Start Padayatra in Telangana : బీఆర్​ఎస్ పార్టీ కార్యకర్తల ఆకాంక్షల మేరకు భవిష్యత్​లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. ఎక్స్​లో నిర్వహించిన ఆస్క్ కేటీఆర్​లో కొంత మంది పాదయాత్రపై ఆయన అభిప్రాయాన్ని కోరారు. ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు పార్టీలను బలోపేతం చేసేందుకు దేశంలోని అనేక పార్టీల నేతలు, పార్టీ అధ్యక్షులు పాదయాత్రలు చేస్తున్నారని, మీరెప్పుడు చేస్తారని కేటీఆర్​ను అడిగారు. వాటికి స్పందించిన కేటీఆర్ కచ్చితంగా పాదయాత్ర ఉంటుందని వెల్లడించారు. పాదయాత్ర చేయాలని అందరూ కోరుతున్నారని, ఆ దిశగా తనను సంసిద్ధుణ్ని చేసుకోనివ్వండని ఆయన తెలిపారు.

KTR Fire on Congress Government : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిండా ముంచిందని కేటీఆర్ ఆరోపించారు. పంట కొనుగోళ్లు, అకాల వర్షాలకు ధాన్యం తడవడంపై ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. వానాకాలం వరి కోతలు సాగుతున్నప్పటికీ, రైతుబంధు, రైతు భరోసా ఊసే లేదని ఆక్షేపించారు. కనీసం పంట కొనుగోలు చేయడం లేదని, దీంతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అకాల వర్షాలకు చాలా చోట్ల కల్లాల్లో, మార్కెట్ యార్డుల్లో ధాన్యం తడిసి ముద్దయిందని కేటీఆర్ పేర్కొన్నారు.

కొండా సురేఖ పబ్లిసిటీ కోసమే ఆ వ్యాఖ్యలు చేశారు - పరువునష్టం దావాపై కేటీఆర్ వాంగ్మూలం

ఈ సీజన్లో 91 లక్షల 28 వేల టన్నుల ధాన్యాన్ని సేకరిస్తామని చెప్పి, అక్టోబర్ 28 వరకు 913 మంది రైతుల నుంచి కేవలం 7,629 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారని తెలిపారు. రైతన్న అంటే ఎంత నిర్లక్ష్యమో చూడండని ఆయన వ్యాఖ్యానించారు. దళారులతో కుమ్మక్కైన కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలేదని, ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో మిల్లుల కేటాయింపు జరగనేలేదని కేటీఆర్ విమర్శించారు. సేకరించిన ధాన్యాన్ని ఏ మిల్లుకు పంపాలో తెలియక ఐకేపీ కేంద్రాల్లో కూడా కొనుగోలు ప్రక్రియ నిలిచిందని అన్నారు. రైతులు కల్లాల్లో కన్నీళ్లు పెడుతుంటే ముఖ్యమంత్రి మాత్రం డైవర్షన్ పాలిటిక్స్​లో బిజీబిజీగా ఉన్నారని కేటీఆర్ మండిపడ్డారు.

తెలంగాణ సీఎం రేవంత్​ VS కేటీఆర్ - అసెంబ్లీ వేదికగా మాటల యుద్ధం - telangana assembly meetings 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.