కరోనా వారియర్ల పిల్లలకు సెంట్రల్ పూల్ నుంచి మెడికల్ సీట్లు కేచాయించనున్నారు. 2020 సెప్టెంబరులో నీట్ పరీక్ష రాసి ఉత్తీర్ణులైన కరోనా వారియర్ల పిల్లలకు సెంట్రల్ పూల్ సీట్లను కేటాయించనున్నట్టు కేంద్రం నోటిఫికేషన్ లో పేర్కొంది. కరోనాతో పోరాడుతూ మృతిచెందిన వైద్యారోగ్య సిబ్బంది, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల సిబ్బంది, పురపాలక సంస్థల సిబ్బంది, కొవిడ్ కోసం రాష్ట్ర ప్రభుత్వాలు నియమించిన కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది పిల్లలు, కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రులు, కేంద్ర, రాష్ట్రప్రభుత్వ అటానమస్ ఆస్పత్రులు, ఎయిమ్స్ తదితర వైద్య సంస్థల సిబ్బంది పిల్లలకూ ఈ కోటా వర్తిస్తుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. సంబంధిత ధ్రువపత్రాలతో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తు చేయాల్సిందిగా సూచిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఇదీ చదవండి: నడ్డాపై దాడి- భాజపా, టీఎంసీ మాటల యుద్ధం