ETV Bharat / city

ఇంద్రకీలాద్రిపై కార్తీకమాస పూజలు.. నేటి నుంచి ప్రారంభం - vijayawada

కార్తీకమాసాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై పలు విశేష పూజలు నిర్వహించేందుకు... దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఏర్పాట్లు చేసింది. నేటి నుంచి డిసెంబరు నాలుగో తేదీ వరకు అర్చనలు, పారాయణలు, అభిషేకాలు జరగనున్నాయి.

ఇంద్రకీలాద్రిపై కార్తీకమాస పూజలు
ఇంద్రకీలాద్రిపై కార్తీకమాస పూజలు
author img

By

Published : Nov 5, 2021, 4:59 AM IST

ఇంద్రకీలాద్రిపై కార్తీకమాస పూజలు.

విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం.. కార్తీకమాసం సందర్భంగా పలు పూజా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఆధ్యాత్మికంగా కార్తీకమాసానికి ఎంతో ప్రాధాన్యం ఉండడం.. కనకదుర్గమ్మతోపాటు మల్లేశ్వరస్వామిని దర్శించుకుని పూజలు చేయించుకునేందుకు.. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చేలా ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించింది. అమ్మవారి ప్రధాన ఆలయం, శివాలయం, నటరాజస్వామి దేవాలయాల్లో ఐదో తేదీ నుంచి ప్రదోషకాలంలో ఆకాశదీపం ఏర్పాటు చేయనున్నారు. ఐదో తేదీ నుంచి డిసెంబరు నాలుగో తేదీ వరకు కార్తీక పారాయణలు, సహస్ర లింగార్చనలు, జపాలు, ప్రత్యేక లింగార్చనలు నిర్వహించనున్నారు.

లక్ష బిల్వాచర్చలో పాల్గొనేందుకు ఒక రోజుకు.. రెండు వేల రూపాయలు సేవా రుసుముగా ఆలయ కమిటీ నిర్ణయించింది. సహగ్ర లింగార్చన ఒక రోజుకు రూ.500, రుద్రహోమం ఒకరోజుకు వెయ్యి రూపాయలు, దీపోత్సవం రోజుకు ఒక్కరికి రూ.50, సహస్ర లింగార్చన నెలరోజులకు రూ.5వేల 116గా నిర్ణయించారు. ఈ ఆర్జిత సేవలలో పాల్గొనే భక్తులు ఆర్జిత సేవా కౌంటరు లేదా, దేవాదాయశాఖ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా టిక్కెట్లు పొందవచ్చని ఆలయ అధికారులు తెలిపారు.

కార్తీక పౌర్ణమి రోజున సాయంత్రం ఆరున్నర గంటలకు అమ్మవారి ప్రధాన ఆలయం, ఉపాలయాలు, ఘాట్‌రోడ్డు, కనకదుర్గానగర్‌ ప్రాంగణాల్లో కోటి దీపోత్సవం జరగనుంది. ఈనెల ఆరో తేదీనా.. అమ్మవారికి విశేషంగా వివిధ వర్ణాల గాజులతో అలంకరణ చేయనున్నారు. అమ్మవారి మూల విరాట్‌తోపాటు ఆలయ ప్రాంగణం మొత్తం గాజులతో అలంకరణ చేయనున్నారు.

ఇదీ చదవండి:

CBN: స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోరాడాలి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.