ముఖ్యమంత్రి జగన్ దుర్మార్గ పాలన వల్ల రైతులు సంక్రాంతి పండుగను సరిగ్గా జరుపుకోలేకపోయారని తెలుగు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి విమర్శించారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులు చెల్లించలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు. ప్రభుత్వం రైతులకు ఏ విధమైన ప్రోత్సాహం అందడం లేదని ఆరోపించారు. ఈ మేరకు విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
కర్నూలు జిల్లా మడకశిరలో రైతు.. సంక్రాంతి రోజు ఆత్మహత్య చేసుకోవాల్సిన దుస్థితి రావడం దారుణమని ఆక్షేపించారు. ప్రభుత్వం మీద నమ్మకం లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణమే వ్యవసాయ రంగ పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు.
ఇదీ చూడండి:
అందని పెట్టుబడి రాయితీ... కర్షకుల ఇంట కనిపించని సంక్రాంతి...