కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థ టీవర్క్స్ రూపొందించిన అత్యాధునిక, తక్కువ ధర గల వెంటిలేటర్లను భారీ ఎత్తున తయారీకి మైక్రోమ్యాక్స్ (భగవతి ప్రొడక్ట్స్ లిమిటెడ్) సంస్థతో సోమవారం ఒప్పందం కుదుర్చుకుంది.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో త్వరలోనే మైక్రోమ్యాక్స్ వీటి ఉత్పత్తిని చేపడుతుంది. హైదరాబాద్‌కు చెందిన క్వార్కమ్, హనీవెల్, స్పెక్టోక్రెమ్, ఇన్‌స్ట్రమెంట్స్, ఎంటెస్లా, ఆల్థియాన్, త్రిశూల, కన్సర్‌విజన్ వంటి అంకుర సంస్థల సహకారంతో టీవర్క్స్ దీనిని రూపొందించింది. పరీక్షల నిర్వహణ అనంతరం చికిత్సకు అనుకూలమైనదిగా ధ్రువీకరణ పత్రం లభించింది.
త్వరలో అత్యుత్తమ వెంటిలేటర్‌ను విడుదల చేస్తామని టీవర్క్స్ సీఈవో సుజయ్ కారంపూరి చెప్పారు. ఈ సంక్షోభ సమయంలో తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం గొప్ప అవకాశమన్నారు మైక్రోమ్యాక్స్ సహ వ్యవస్థాపకుడు రాజేశ్ అగర్వాల్.
ఇవీ చూడండి: మా నీటినే.. మేం వాడుకుంటాం: సీఎం జగన్