ETV Bharat / city

తోతాపురి ధరలు పతనం.. వ్యాపారులు సిండికేట్‌ కావడమే కారణం

మామిడి రైతులు ఈ సంవత్సరం వరుస నష్టాలు చవిచూస్తున్నారు. సరిగ్గా కాయలు వచ్చే సమయానికి కర్ఫ్యూతోపాటు ఇతర రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ కారణంగా ఎగుమతులు నిలిచాయి. రైతులు స్వయంగా ఇతర ప్రాంతాలకు తరలించలేక, తక్కువ ధరకు ఇవ్వలేక కాయలను కోయకుండా చెట్లపైనే వదిలేస్తున్నారు. పండ్లకు గిట్టుబాక ధరలేకపోవటంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు.

mango farmers problems
తోతాపురి ధరలు పతనం
author img

By

Published : Jun 23, 2021, 8:23 AM IST

మామిడి రైతులను ఈ ఏడాది వరుస కష్టాలు వెంటాడుతున్నాయి. సరిగ్గా కాయలు వచ్చే సమయానికి కర్ఫ్యూతోపాటు ఇతర రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ కారణంగా ఎగుమతులు నిలిచాయి. రైతులు స్వయంగా ఇతర ప్రాంతాలకు తరలించలేక, తక్కువ ధరకు ఇవ్వలేక కాయలను కోయకుండా చెట్లపైనే వదిలేస్తున్నారు. ప్రస్తుతం కర్ఫ్యూ సడలింపులు వచ్చినప్పటికీ ఆశించిన ధర లేక.. రూ.లక్షలు పెట్టి తోటలు కొన్న రైతులు దిగాలు చెందుతున్నారు. ముఖ్యంగా చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో పరిస్థితి దారుణంగా ఉంది.

మార్కెట్‌ మాయాజాలంలో తోతాపురి

చిత్తూరు జిల్లాలో మొత్తం 2,80,472 ఎకరాలలో మామిడి సాగవుతోంది. ఇందులో ఒక్క తోతాపురి రకమే 1.68 లక్షల ఎకరాలు. గతేడాది సీజన్‌ ప్రారంభంలో తోతాపురి కిలో రూ.10-11, మధ్యలో రూ.15-16, చివర్లో రూ.24 పలికింది. ఈ ఏడాది ఆరంభం నుంచే ధరలు పతనమవుతూనే ఉన్నాయి. ప్రారంభంలో కిలో రూ.9 ఉండగా... ప్రస్తుతం మామిడి గుజ్జు పరిశ్రమలు, మండీ వ్యాపారులు రూ.6 నుంచి రూ.8కు కొనుగోలు చేస్తున్నారు. కొన్ని పరిశ్రమల వద్ద రోజుల తరబడి రైతుల ఉత్పత్తులను అనుమతించే పరిస్థితి లేకపోవడంతో కాయలు వాహనాల్లోనే కుళ్లిపోతున్నాయి. కనీసం కిలోకు రూ.16 ధర చెల్లిస్తేనే గిట్టుబాటు అవుతుందని అన్నదాతలు అంటున్నారు. ధరల పతనంపై కొన్నిరోజులుగా ఆందోళన చేస్తున్న రైతులు.. తాజాగా సోమవారం చిత్తూరులోని కలెక్టరేట్‌ వద్ద బైఠాయించారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది గుజ్జు పరిశ్రమ వర్గాలు కుమ్మక్కయ్యాయని, ఇందుకు ఓ ప్రజాప్రతినిధి బంధువే కారణమని వారు ఆరోపిస్తున్నారు. పలుమార్లు యాజమాన్యాలతో సమావేశాలు నిర్వహించి.. తోతాపురి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కలెక్టర్‌ చెప్పినా.. వారు లెక్కేచేయడంలేదు. గత వారం జరిగిన సమావేశంలో కిలో తోతాపురికి రూ.11 ఇవ్వడానికి పాలనాధికారి వద్ద అంగీకరించి.. మరుసటి రోజు నుంచే వ్యాపారులు ధర తగ్గించడం ప్రారంభించారు. మరో 10-15 రోజులు మాత్రమే సీజన్‌ ఉంటుందని, ఇప్పటికైనా అధికారులు స్పందించి.. గిట్టుబాటు ధర కల్పించాలని అన్నదాతలు డిమాండ్‌ చేస్తున్నారు.

దిగుబడి బాగున్నా దిగులు తప్పలేదు

ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలంలోని ఇసుక, ఎర్ర నేలల్లో పండే మామిడికి ఉభయ తెలుగు రాష్ట్రాలు, మహారాష్ట్ర, విదేశాల్లో మంచి పేరుంది. జిల్లాలో దాదాపు 20 వేల ఎకరాల్లో మామిడి తోటలు ఉండగా ఒక్క ఉలవపాడు, గుడ్లూరు మండలాల్లోనే 12 వేల ఎకరాల్లో కనిపిస్తాయి. వాతావరణం అనుకూలించడంతో దిగుబడి ఈసారి మెరుగ్గా వచ్చింది. ఏప్రిల్‌, మేలలో నూజివీడు కాయలు టన్ను రూ.లక్షకు పైగా పలకడంతో జిల్లా రైతులు ఆశలు పెంచుకున్నారు. ఉలవపాడు మామిడి రకాల్లో రారాజు అయిన బంగినపల్లి కాయలను కొనేందుకు గుంటూరు, కృష్ణా, నెల్లూరు జిల్లాలతోపాటు తెలంగాణ, మహారాష్ట్ర నుంచి కూడా వ్యాపారులు వస్తారు. విదేశాలకు సైతం ఎగుమతి చేస్తారు. ఈసారి కర్ఫ్యూ కారణంగా వ్యాపారం దారుణంగా దెబ్బతిన్నది. తక్కువ దిగుబడి వచ్చిన రైతులు జిల్లా వ్యాపారులకు అయినకాడికి అమ్ముకున్నారు. చాలామంది గిట్టుబాటు కాదని అలానే చెట్లపై వదిలేశారు.

రూ.18 వేలకు ఇస్తారా?

బంగినపల్లె మామిడి గత నెలలో కాయసైజును బట్టి టన్ను రూ.35-45 వేల వరకు పలికింది. ప్రస్తుతం గుంటూరు, నెల్లూరు వ్యాపారులు వస్తున్నా ఇసుక నేలలో కాయలను టన్ను రూ.18-20 వేలకు, ఎర్రనేలలో కాయలను రూ.22 వేలకు అడుగుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కాయలు చెట్ల పైనే మాగి, రాలి కుళ్ల్లిపోతున్నాయని వాపోతున్నారు.

వాహనాల్లోనే కుళ్లిపోతున్నాయ్‌

గొల్లపల్లెలోని 12 ఎకరాల మామిడి తోటలకు ఈసారి రూ.4 లక్షలు పెట్టుబడి పెట్టా. ప్రస్తుత ధరల ప్రకారం కాయలు అమ్మితే భారీగా నష్టం వస్తుంది. గ్రామ సమీపంలోని గుజ్జు పరిశ్రమకు ట్రాక్టరులో అయిదు టన్నుల తోతాపురిని తరలిస్తే... రెండు, మూడు రోజులు బయటే ఉండాల్సి వస్తోంది. దాంతో సగానికిపైగా పండ్లు కుళ్లిపోతున్నాóు. ప్రభుత్వం కిలో తోతాపురికి రూ.16 ఇస్తేనే మేం బయటపడతాం.

-విశ్వనాథరెడ్డి, గొల్లపల్లె, గంగాధరనెల్లూరు మండలం

ఇదీ చదవండి:

KARANAM MALLESWARI: దిల్లీ క్రీడా విశ్వవిద్యాలయం వీసీగా కరణం మల్లీశ్వరి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.