చెరువులో మునిగి.. రాష్ట్రానికి చెందిన వ్యక్తి మృతి చెందిన ఘటన తెలంగాణలోని సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ వివాహ కార్యక్రమానికి విజయవాడ నుంచి వధువు తరుపున వచ్చిన పల్లా గణేశ్ (27), యోగీశ్వర్, మణికంఠ, సంతోష్, మరికొందరు.. చెరువు వద్ద స్నానం చేసేందు వెళ్లారు.
గణేశ్ ఈదుకుంటూ లోపలికి వెళ్లి మునిగిపోయాడు. గమనించిన అతని బావమరుదులు సంతోష్, యోగిశ్వర్ అతన్ని ఒడ్డుకు తీసుకువచ్చే క్రమంలో కొంచెం దూరం లాక్కొచ్చి ఊపిరాడక వదిలేశారు. కాసేపటికే అతను నీటిలో గల్లంతయ్యాడు. స్థానిక ఎస్సై ఘటన స్థలికి చేరుకోని మత్స్యకారుల సాయంతో గణేశ్ మృత దేహన్ని ఒడ్డుకు చేర్చారు. గణేశ్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఇదీ చదవండి: