ఒడిశాలోని దక్షిణ కోస్తా తీరాన్ని ఆనుకుని అల్పపీడనం కొనసాగుతోంది. అల్పపీడన ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ సహా ఉభయగోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని వాతావరణశాఖ వెల్లడించింది. దక్షిణ భారతావనిపై రుతుపవనాలు క్రియాశీలకంగా ఉండటంతో ఒడిశా, చత్తీస్ గఢ్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం వెల్లడించింది. ఇక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం, ఉష్ణోగ్రతల వివరాలు ఇలా ఉన్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా నమోదైన వర్షపాతం
ప్రాంతం | వర్షపాతం (సెంటిమీటర్లు) |
ఇచ్చాపురం | 3.5 |
పాడేరు | 2.2 |
సీతంపేట | 2.1 |
కొయ్యూరు | 1.3 |
భోగాపురం | 1.1 |
ఎటపాక | 1 |
తణుకు | 1 |
నమోదైన ఉష్ణోగ్రతలు
ప్రాంతం | డిగ్రీల సెల్సియస్ |
విజయవాడ | 31 |
విశాఖపట్నం | 34 |
తిరుపతి | 31 |
అమరావతి | 33 |
విజయనగరం | 36 |
నెల్లూరు | 32 |
గుంటూరు | 31 |
శ్రీకాకుళం | 35 |
కర్నూలు | 31 |
ఒంగోలు | 30 |
ఏలూరు | 32 |
కడప | 30 |
రాజమహేంద్రవరం | 35 |
కాకినాడ | 34 |
అనంతపురం | 31 |
ఇదీచదవండి