suspension of registrations: ఖాళీ స్థలాలు /అన్ అప్రూవ్డ్ స్థలాల రిజిస్ట్రేషన్లలో నెలకొన్న గందరగోళాన్ని తొలగించాలని సబ్ రిజిస్ట్రార్ల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్‌శాఖ ఐజీ జారీ చేసిన ఉత్తర్వుల వల్ల క్షేత్ర స్థాయిలో గందరగోళం నెలకొని సబ్ రిజిస్ట్రార్లపై తీవ్ర ఒత్తిడి పెరిగిందని ఆవేదన వ్యక్తం చేసింది.
రిజిస్ట్రేషన్లు తగ్గి... ప్రభుత్వ ఖజానాకూ నష్టం ఏర్పడుతోందని పేర్కొంది. ఈ మేరకు సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌కు సోమవారం సంఘం అధ్యక్షుడు కొండారెడ్డి, ప్రధాన కార్యదర్శి గోపాల్, కోశాధికారి ఆనందకుమార్ విజ్ఞాపన పత్రాన్ని అందచేశారు.
ఇదీ చదవండి:
ప్రైవేట్ భాగస్వామ్యంతో పర్యాటక రంగాన్ని అభివృద్ది చేస్తాం: మంత్రి అవంతి