ముఖ్యమంత్రి జగన్ రెడ్డి విడుదల చేసింది ఉత్తుత్తి ఉద్యోగాల డాబు క్యాలెండర్ అని.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(lokesh) విమర్శించారు. 2.30లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన జగన్.. అధికారంలోకి వచ్చాక నిరుద్యోగ యువతను మోసం చేశారని మండిపడ్డారు.
-
డూబు రెడ్డి ఉత్తుత్తి ఉద్యోగాల డాబు కాలెండర్ విడుదల చేసారు.2లక్షల 30 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని @ysjagan హామీ ఇచ్చి అధికారంలోకొచ్చాకా నిరుద్యోగ యువతని మోసం చేసారు.ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకుని..(1/3) pic.twitter.com/IxLVgXQEZW
— Lokesh Nara (@naralokesh) June 18, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">డూబు రెడ్డి ఉత్తుత్తి ఉద్యోగాల డాబు కాలెండర్ విడుదల చేసారు.2లక్షల 30 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని @ysjagan హామీ ఇచ్చి అధికారంలోకొచ్చాకా నిరుద్యోగ యువతని మోసం చేసారు.ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకుని..(1/3) pic.twitter.com/IxLVgXQEZW
— Lokesh Nara (@naralokesh) June 18, 2021డూబు రెడ్డి ఉత్తుత్తి ఉద్యోగాల డాబు కాలెండర్ విడుదల చేసారు.2లక్షల 30 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని @ysjagan హామీ ఇచ్చి అధికారంలోకొచ్చాకా నిరుద్యోగ యువతని మోసం చేసారు.ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకుని..(1/3) pic.twitter.com/IxLVgXQEZW
— Lokesh Nara (@naralokesh) June 18, 2021
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకుని 54వేలు ఉద్యోగాలు కొత్తగా ఇచ్చినట్టు మోసపు ప్రకటన ఇచ్చారని ఆరోపణలు చేశారు. వైకాపా కార్యకర్తలకు వాలంటీర్లు, వార్డు, గ్రామ సచివాలయల్లో పోస్టులు వేసుకుని.. ఉద్యోగాలు ఇచ్చినట్లు హడావుడి చేస్తున్నారన్నారు. దొంగ ఓట్లేయించే వైకాపా కార్యకర్తల్ని.. వాలంటీర్లుగా నియమించటం వివక్ష లేకపోవడమా? అంటూ నిలదీశారు.
వార్డు, గ్రామసచివాలయ ఉద్యోగ భర్తీ పరీక్ష పేపరు అమ్మేయడం అవినీతికి తావులేకుండా భర్తీ చేసినట్టా? ఉద్యోగాలు అమ్ముకోవడం మీ భాషలో అత్యంత పారదర్శకతా? జే గ్యాంగ్ ప్రాణాంతక మద్యం బ్రాండ్లు ప్రెసిడెంట్ మెడల్ అమ్మే ఉద్యోగాలూ గౌరవనీయమైన ప్రభుత్వ ఉద్యోగాలా? అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
తప్పుడు ప్రకటనలతో కోట్లాది రూపాయలు వృథా చేస్తున్నారు..
వందల్లో కూడా ఉద్యోగాలు భర్తీ చేయకుండా.. ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ నౌకరీలను కలుపుకుని తప్పుడు ప్రచార ప్రకటనలతో కోట్లాది రూపాయలు వృథా చేస్తున్నారని మండిపడ్డారు. గ్రూప్-1, గ్రూప్-2 పోస్టులు 907, పోలీస్ శాఖలో 7740 ఖాళీలున్నాయని గత సీఎస్ ప్రకటిస్తే.. గ్రూప్-1,2 కలిపి 36, పోలీస్‌శాఖలో 450 పోస్టులు ఉన్నట్లు క్యాలెండర్లో ఉన్నాయన్నారు. ఉద్యోగుల వేతనాల పెంపులోనూ అవాస్తవాలు ప్రకటించారని విమర్శలు గుప్పించారు.
అంగన్వాడీలు, హోమ్ గార్డులు, వీఆర్ఏలకు.. తెదేపా ప్రభుత్వం భారీగా వేతనాలు పెంచితే, నామ మాత్రపు పెంపుతో వైకాపా మోసం చేసిందని ఆగ్రహించారు. సీఎం జగన్ గద్దెనెక్కి 700 రోజులు దాటినా.. సీపీఎస్ రద్దు ఊసు, డీఏ, పీఆర్సీల పై కనీస ప్రస్తావన లేదని దుయ్యబట్టారు.
-
వార్డు, గ్రామసచివాలయ ఉద్యోగ భర్తీ పరీక్ష పేపరు అమ్మేయడం అవినీతికి తావులేకుండా భర్తీ చేసినట్టా?ఉద్యోగాలు అమ్ముకోవడం మీ భాషలో అత్యంత పారదర్శకతా? జే గ్యాంగ్ ప్రాణాంతక మద్యం బ్రాండ్లు ప్రెసిడెంట్ మెడల్ అమ్మే ఉద్యోగాలూ గౌరవనీయమైన ప్రభుత్వ ఉద్యోగాలా?(3/3)
— Lokesh Nara (@naralokesh) June 18, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">వార్డు, గ్రామసచివాలయ ఉద్యోగ భర్తీ పరీక్ష పేపరు అమ్మేయడం అవినీతికి తావులేకుండా భర్తీ చేసినట్టా?ఉద్యోగాలు అమ్ముకోవడం మీ భాషలో అత్యంత పారదర్శకతా? జే గ్యాంగ్ ప్రాణాంతక మద్యం బ్రాండ్లు ప్రెసిడెంట్ మెడల్ అమ్మే ఉద్యోగాలూ గౌరవనీయమైన ప్రభుత్వ ఉద్యోగాలా?(3/3)
— Lokesh Nara (@naralokesh) June 18, 2021వార్డు, గ్రామసచివాలయ ఉద్యోగ భర్తీ పరీక్ష పేపరు అమ్మేయడం అవినీతికి తావులేకుండా భర్తీ చేసినట్టా?ఉద్యోగాలు అమ్ముకోవడం మీ భాషలో అత్యంత పారదర్శకతా? జే గ్యాంగ్ ప్రాణాంతక మద్యం బ్రాండ్లు ప్రెసిడెంట్ మెడల్ అమ్మే ఉద్యోగాలూ గౌరవనీయమైన ప్రభుత్వ ఉద్యోగాలా?(3/3)
— Lokesh Nara (@naralokesh) June 18, 2021
ఇదీ చదవండి: