ETV Bharat / city

చంద్రబాబును విమర్శించినా.. చివరకు ఆయన బాటలోనే జగన్: లోకేశ్ - లోకేశ్ లేటెస్ట్ న్యూస్

గతంలో గ్రీన్​కో విషయంలో తెదేపాపై బురదజల్లే ప్రయత్నం చేసిన జగన్.. ఇప్పుడు అదే కంపెనీకి రిబ్బన్ కట్​ చేశారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. తెదేపా అధినేత చంద్రబాబుపై జగన్ ఎన్ని విమర్శలు చేసినా.. ఆఖరికి ఆయన బాటలో నడుస్తున్నారన్నారు.

లోకేశ్
లోకేశ్
author img

By

Published : May 17, 2022, 7:20 PM IST

Lokesh on Jagan: తెదేపా అధినేత చంద్రబాబుపై ఎన్ని విమర్శలు చేసినా.. ఆఖరికి జగన్‌రెడ్డి కూడా ఆయన బాటలోనే నడుస్తున్నారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు. గతంలో గ్రీన్‌కో ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని తెదేపాపై బురద జల్లే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ఇప్పుడు అదే కంపెనీకి రిబ్బన్‌ కట్‌ చేసి.. తమపై చేసిన ఆరోపణలన్నీ అవకాశవాద రాజకీయం కోసమేనని జగనే స్వయంగా ఒప్పుకున్నారని ఎద్దేవా చేశారు. ఇందుకు జగన్ రెడ్డికి థాంక్స్ అంటూ లోకేశ్‌ ట్వీట్‌ చేశారు.

నారా లోకేశ్ ట్వీట్
నారా లోకేశ్ ట్వీట్

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.