ETV Bharat / city

తెలంగాణలో లాక్​డౌన్ 2.0... తాజా నిబంధనలు​ ఇవే..!

తెలంగాణలో బుధవారం ఉదయం 10 గంటల నుంచి లాక్​డౌన్​ అమలుకానుంది. మే 12 నుంచి 22 వరకు పదిరోజులు కొనసాగనున్న లాక్​డౌన్​కు సంబంధించి ఆ రాష్ట్ర ప్రభుత్వం పలు నిబంధనలు జారీ చేసింది. ఈ నిబంధనల్లో ప్రధానంగా.. రైతులకు, ప్రజా జీవనానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు సర్కారు పలు మినహాయింపులు ఇచ్చింది.

తెలంగాణలో లాక్​డౌన్ 2.0... తాజా నిబంధనలు​ ఇవే..!
తెలంగాణలో లాక్​డౌన్ 2.0... తాజా నిబంధనలు​ ఇవే..!
author img

By

Published : May 11, 2021, 8:56 PM IST

లాక్​డౌన్​ 2.0 నిబంధనలు...

  • వ్యవసాయ, అనుబంధ రంగాలకు లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు
  • ఫార్మా, ఆస్పత్రులు, మెడికల్‌ షాపులకు మినహాయింపు
  • పెట్రోల్‌ పంపులు, శీతల గిడ్డంగులు, మీడియాకు మినహాయింపు
  • బ్యాంకులు, ఏటీఎంల నిర్వహణకు మినహాయింపు
  • 33 శాతం సిబ్బందితో ప్రభుత్వ కార్యాలయాలు నడవాలని నిర్ణయం
  • ముందస్తు అనుమతితో పెళ్లిళ్లకు గరిష్ఠంగా 40 మందికి మాత్రమే అనుమతి
  • అంత్యక్రియలకు 20 మందికి మాత్రమే అనుమతి
  • రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టుల ఏర్పాటు
  • ఉ.6 - 10 వరకు అన్ని రకాల మెట్రో, ప్రజా రవాణా, ఆర్టీసీకి అనుమతి
  • ఉ.6 – 10 వరకు రేషన్‌ దుకాణాలకు అనుమతి
  • యథావిధిగా వంట గ్యాస్‌ సిలిండర్లు సరఫరా
  • సినిమా హాళ్లు, క్లబ్బులు, స్విమ్మింగ్‌పూల్స్‌, వినోద పార్క్‌లు, క్రీడా మైదానాలు మూసివేత
  • నిబంధనలు పూర్తిస్థాయిలో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు

కేబినెట్‌ సమావేశంలో తీసుకున్న మరిన్ని కీలక నిర్ణయాలు..

  • మే 20న కేబినెట్‌ మరోసారి సమావేశం అవుతుంది. లాక్‌డౌన్ కొనసాగించే విషయంపై సమీక్షించి తదుపరి నిర్ణయం
  • యుద్ధ ప్రాతిపదికన.. వ్యాక్సిన్ ప్రొక్యూర్‌మెంట్ కోసం గ్లోబల్ టెండర్లు
  • ప్రభుత్వ రంగంతోపాటు, ప్రైవేట్ రంగంలో కూడా రెమ్​డెసివిర్ ఇంజక్షన్లు, ఆక్సిజన్, ఇతర కరోనా మందులను అందుబాటులోకి తీసుకురావడం. వీటి కొరత రాకుండా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ ఆదేశాలు
  • అన్ని జిల్లాల్లో మంత్రుల అధ్యక్షతన కలెక్టర్, డీఎంహెచ్ఓ, జిల్లా కేంద్రంలోని దవాఖానా సూపరింటెండెంట్, డ్రగ్ ఇన్‌స్పెక్టర్లతో కమిటీ వేయాలని నిర్ణయం
  • రోజూ ఆయా జిల్లాల మంత్రులు వారి వారి జిల్లా కేంద్రాల్లో కరోనాపై సమీక్ష చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశం

రెమ్​డెసివిర్ ఇంజక్షన్ ఉత్పత్తిదారులతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా ఫోన్‌లో మాట్లాడారు. రాష్ట్రానికి తగినన్ని మందులను సరఫరా చేయాలని కోరారు. ఏ రోజుకారోజు మందులు, వ్యాక్సిన్లను వేగవంతంగా సమకూర్చి, సరఫరా చేయడం కోసం మంత్రి కేటీఆర్ అధ్యక్షతన రాష్ట్రస్థాయి టాస్క్ ఫోర్స్ నియామకానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, సీఎంఓ నుంచి సీఎం కార్యదర్శి, కొవిడ్ ప్రత్యేకాధికారి రాజశేఖర్ రెడ్డి ఈ టాస్క్ ఫోర్స్‌లో సభ్యులుగా ఉంటారు.

ఇదీ చూడండి:

లాక్​డౌన్​ ఎఫెక్ట్​: 'మీ అమ్మకు చెప్పు.. ఏదో ఒక రోజు సీఎం అవుతా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.