నిబంధనలకు విరుద్ధంగా శాసనసభ సమావేశాలు నిర్వహిస్తున్నారని తెదేపా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. టీడీఎల్పీ సమావేశం అనంతరం మాట్లాడిన నేతలు.. రేపు జరిగే సమావేశాలకు తమ పార్టీ సభ్యులు ఎవరూ హాజరుకావటం లేదని తెలిపారు. కేవలం మండలి రద్దు ఎజెండానే ప్రభుత్వం సమావేశాలు నిర్వహిస్తుందని పేర్కొన్నారు. తమ ఎమ్మెల్సీలను ప్రలోభాలకు గురి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా...తెదేపా ఎమ్మెల్సీలు ఎవరూ పార్టీని వీడిపోరని రామానాయుడు స్పష్టం చేశారు. శాసనమండలి రద్దు నిర్ణయం సరైంది కాదని ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు. ఒకవేళ ప్రభుత్వం రద్దు ప్రతిపాదనకు మెుగ్గుచూపినా...అది అంత సులభం కాదని పార్లమెంటు ఆమోదం పొందాలని అన్నారు.
ఇదీచదవండి