LAWYER SRAVAN KUMAR: ఎస్సీ ఎస్టీలకు రూ.23 వేల కోట్లు ఖర్చు పెట్టినట్లు అసెంబ్లీ వేదికగా మంత్రి విశ్వరూప్ మాట్లాడటం సరికాదని న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ అన్నారు. వెనుకబడిన వర్గాలకు ఎన్ని నిధులు ఖర్చు చేశారో తేల్చడానికి.. మంత్రి విశ్వరూప్ చర్చకు సిద్ధమా? అని విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రవణ్ సవాల్ విసిరారు. అధికారంలోకి వచ్చే ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు.. ప్రస్తుతం నీటి బుడగల్లా మారాయని ఆయన మండిపడ్డారు.
కొత్త పథకాలు అమలు చేయకపోయినా పర్లేదు కానీ.. అమలులో ఉన్న పథకాలను రద్దు చేయడం బాధాకరమని అన్నారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను అమ్మఒడికి మళ్లించారని.. ఆ హక్కు ప్రభుత్వానికి ఎక్కడిదని? ప్రశ్నించారు. మంత్రుల భజనలతో ప్రజల్ని మోసం చేయొద్దని, ప్రభుత్వం చెప్పే అబద్ధాలను ప్రజలకు వివరించి చైతన్యపరుస్తామని చెప్పారు. డిసెంబర్ 6న అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఇటీ చదవండి:
jawad cyclone : కోస్తాకు తుపాను ముప్పు.. భారీగా భద్రతాదళాల మోహరింపు