ఉత్తర కోస్తాంధ్ర- దక్షిణ ఒడిశా తీరాలకు దగ్గరగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాగల 48 గంటల్లో పశ్చిమమధ్య- వాయువ్య బంగాళాతంలో కోస్తాంధ్ర తీరానికి దగ్గరగా అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
ఆవర్తనం ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, గోదావరి జిల్లాల్లో చాలాచోట్ల వర్షాలు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు.. అనంతపురం, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వెల్లడించారు. రాష్ట్రంలో కురిసిన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి.
రాష్ట్రంలో నమోదైన వర్షపాతం
ప్రాంతం నమోదైన వర్షపాతం(సెంటీమీటర్లలో)
తుగ్గలి - 8
పెద్జపప్పూర్ - 7.2
సంజమల - 5.8
తాడిపత్రి - 4.9
కొండాపురం - 4.8
కవిటి - 4.6
కోయిల్ కుంట్ల - 4
తండూరు - 3.5
వాయల్పాడు - 3.4
నగరం - 3.2
అవుకు - 3.1
పలాస - 2.6
సోంపేట - 1.8
కర్నూలు - 1
రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు
ప్రాంతం ఉష్ణోగ్రతల వివరాలు (డిగ్రీలలో)
విజయవాడ - 35
విశాఖపట్నం - 35
తిరుపతి - 35
అమరావతి - 38
విజయనగరం 36
నెల్లూరు - 36
గుంటూరు - 36
శ్రీకాకుళం - 35
కర్నూలు - 35
ఒంగోలు - 32
ఏలూరు - 34
కడప - 32
రాజమహేంద్రవరం - 39
కాకినాడ - 36
అనంతపురం - 34
ఇదీ చదవండి:
ప్రత్యేకం: ఐటీ ఉద్యోగం వదిలేశాడు.. సాగులో లాభాలు ఆర్జిస్తున్నాడు!