ETV Bharat / city

కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా - కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా న్యూస్

http://10.10.50.85:6060//finalout4/telangana-nle/thumbnail/08-July-2021/12397475_316_12397475_1625750928351.png

author img

By

Published : Jul 8, 2021, 7:06 PM IST

Updated : Jul 8, 2021, 7:44 PM IST

19:04 July 08

శుక్రవారం జరగాల్సిన కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా పడింది. సమావేశం తేదీని త్వరలో వెల్లడిస్తామన్న కేఆర్‌ఎంబీ తెలిపింది. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదంతో కేఆర్‌ఎంబీ భేటీ కీలకంగా మారింది.

వివాదం ఇలా మొదలైంది

"ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా చేపడుతున్న ఆర్డీఎస్ కుడికాల్వ విస్తరణ పనులను వెంటనే ఆపాలి" అంటూ తెలంగాణ ప్రభుత్వం కృష్ణానదీ యాజమాన్య బోర్డును కోరింది. ఈ మేరకు బోర్డు ఛైర్మన్​కు రాష్ట్ర నీటిపారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు. విభజన చట్టానికి విరుద్ధంగా ఏపీ ఆర్డీఎస్ కుడికాల్వ విస్తరణ పనులను చేపడుతోందని గతంలోనే ఫిర్యాదు చేశామని... అక్కడ పనులు ఇంకా వేగంగా జరుగుతున్నాయని లేఖలో పేర్కొన్నారు. పనులకు సంబంధించి ఛాయాచిత్రాలను కూడా ఫిర్యాదుతో జతపరిచారు.

సుప్రీంకోర్టు స్టే ఉన్నప్పటికీ...

కృష్ణా రెండో ట్రైబ్యునల్ అవార్డుపై సుప్రీంకోర్టు స్టే ఉన్నప్పటికీ చట్టవిరుద్ఘంగా ఆర్టీఎస్ కుడి కాల్వ విస్తరణ పనులను ఆంధ్రప్రదేశ్ కొనసాగించిందని.. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు అడ్డుకోపోవడంపై ఇటీవల తెలంగాణ మంత్రివర్గం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిందని ఈఎన్సీ తెలిపారు. అక్రమంగా జరుగుతున్న కుడి కాల్వ విస్తరణ పనులను నిలువరించకపోతే తెలంగాణ కేటాయింపుల్లో సగం కూడా వచ్చే అవకాశం ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ తక్షణమే ఆర్డీఎస్ కుడికాల్వ విస్తరణ పనులను నిలిపివేసేలా తగిన చర్యలు తీసుకోవాలని బోర్డును కోరారు.

విద్యుత్​ ఉత్పత్తి ప్రారంభం

తర్వాత శ్రీశైలం, నాగార్జునసాగర్​, పులిచింతలలో విద్యుత్ ఉత్పత్తిని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. దీనిపై ఏపీ ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు లేఖ రాసింది. నీటి వినియోగంపై తెలంగాణ తీరును తప్పుబడుతూ.. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి వేర్వేరుగా లేఖలు రాశారు. విద్యుదుత్పత్తికి ఏకపక్షంగా నీటిని వినియోగిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ఏపీ ప్రయోజనాలు దెబ్బతినేలా తెలంగాణ వ్యవహరిస్తోందని వివరించారు.

ఒప్పందాలను ఉల్లంఘించారు

తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలను ఉల్లంఘించిందని జగన్‌ ఆక్షేపించారు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌, పులిచింత ప్రాజెక్టుల్లో ఏకపక్షంగా విద్యుదుత్పత్తి కోసం నీటిని వినియోగిస్తున్నారని తెలిపారు. జల వివాదాల విషయంలో ప్రధాన మంత్రి జోక్యం చేసుకోవాలని కోరారు. ఉమ్మడి ప్రాజెక్టుల వద్ద సీఐఎస్‌ఎఫ్‌ బలగాలను మోహరించాలని విజ్ఞప్తి చేశారు. నీటి వినియోగం, జలాల పంపకాల విషయంలో కేఆర్‌ఎంబీ పరిధిని నిర్దేశించాలని  ప్రధానిని కోరారు. తెలంగాణ ఉల్లంఘనలపై కేఆర్‌ఎంబీకి రాసిన లేఖలను ప్రధాని, జలశక్తి మంత్రికి రాసిన లేఖలకు జతపరిచారు. రెండు రాష్ట్రాల మధ్య జల వివాదం తీవ్రమైన నేపథ్యంలో ఈనెల తొమ్మిదిన సమావేశం నిర్వహించాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నిర్ణయించింది. ఈ సమావేశం అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది.

ఇదీ చదవండి:

తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు నిలువరించండి: కేంద్రానికి రాష్ట్ర జలవనరుల శాఖ లేఖ

Last Updated : Jul 8, 2021, 7:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.