ETV Bharat / city

Kollu Ravindra: భయంతోనే అమరావతి ఐకాస నేతల గృహనిర్భందం

author img

By

Published : Jun 19, 2021, 9:13 PM IST

రాజధాని గ్రామాల్లో చెక్‌పోస్టులు పెట్టి ప్రజల్ని, అమరావతి రైతులను ఇబ్బందులకు గురి చేయటం హేయమైన చర్య అని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర మండిపడ్డారు. రైతులంటే ప్రభుత్వానికెందుకంత భయమని ఆయన ప్రశ్నించారు.

kollu
భయంతోనే అమరావతి ఐకాస నేతల గృహనిర్భందం

ముఖ్యమంత్రి జగన్ ఇంటిని ముట్టడిస్తారనే భయంతోనే అమరావతి ఐకాస నేతల గృహనిర్భందం చేశారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. రాజధాని గ్రామాల్లో చెక్‌పోస్టులు పెట్టి ప్రజల్ని, అమరావతి రైతులను ఇబ్బందులకు గురి చేయటం హేయమైన చర్య అని మండిపడ్డారు. రైతులంటే ప్రభుత్వానికెందుకంత భయమని ఆయన ప్రశ్నించారు. 550 రోజులుగా సాగుతున్న అమరావతి రైతుల ఉద్యమం..చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు.

'సీఎం పదవికి రాజీనామా చేయండి'

ప్రత్యేక హోదాపై కేంద్రంతో పోరాడలేకపోతే సీఎం జగన్ తన పదవికి రాజీనామా చేయాలని తెదేపా ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామి డిమండ్ చేశారు. ప్రత్యేక హోదా అంశంలో 5 కోట్ల మందిని వంచించిన సీఎం జగన్ ఇప్పటికైనా మౌనం వీడాలని డిమాండ్ చేశారు. స్వలాభం కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడితే చరిత్రలో ద్రోహులుగా మిగిలిపోతారని మండిపడ్డారు.

అధికార పార్టీ నిర్లక్ష్యం వల్లే కొవిడ్ కేసులు పెరిగాయి..

ఉత్తరాంధ్రలో కొవిడ్ కేసులు పెరగటానికి అధికారపార్టీ నేతల విచ్చలవిడి పర్యటనలే కారణమని తెదేపా రాష్ట్ర కార్యదర్శి గౌతు శిరీష విమర్శించారు. విశాఖను రాజధాని చేస్తామన్న నేతలు..కరోనా కేసుల్లో ఉత్తరాంధ్రను అగ్రభాగాన నిలిపారని ఎద్దేవా చేశారు. పాలకల నిర్లక్ష్యం కారణంగానే దేశంలోనే అత్యధిక కొవిడ్ కేసులున్న జిల్లాల్లో విశాఖ, శ్రీకాకుళం ఉన్నాయని ఆక్షేపించారు.

ఇదీచదవండి

Case on Lokesh:విజయవాడ సూర్యారావుపేట పీఎస్‌లో లోకేశ్‌పై కేసు నమోదు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.