ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సీఎం జగన్ బినామీ కాబట్టే..ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు క్షమాపణ చెప్పించకుండా సీఎం ఇంటికి పిలిపించి అహం ప్రదర్శించారని తెదేపా నేత కొల్లు రవీంద్ర విమర్శించారు. వైకాపా ప్రభుత్వం బీసీలను చులకనగా చూస్తూ..వారి గొంతునొక్కి అవమానిస్తోందని మండిపడ్డారు. సుభాష్ చంద్రబోస్‌ను చూస్తేనే వైకాపాలో ఉన్న బీసీ నేతల పరిస్థితి అర్థమవుతోందన్నారు. అవినీతి, అక్రమాలు, అరాచకమే అజెండాగా బీసీలను అణగదొక్కుతున్నారని ధ్వజమెత్తారు.
చినరాజప్పకు క్షమాపణలు చెప్పాలి..
తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు నిమ్మకాయల చినరాజప్పకు కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని మాజీమంత్రి జవహర్ డిమాండ్ చేశారు. ద్వారంపూడి మద్యం తాగి జిల్లా సమీక్షల్లో రంకలేస్తున్నారని ఆరోపించారు. వాటాల పంపకాల్లో ఏ1గా పేరొందిన జగన్మోహన్ రెడ్డి దగ్గర పంచాయితీలు పెట్టుకోవాలి తప్ప సమావేశాల్లో వ్యక్తిగత దూషణలు తగవని హితవు పలికారు.
ఇదీచదవండి