సీఎం జగన్‌ను ప్రజలు దీవిస్తుంటే చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని.. మంత్రి కొడాలి నాని (KODALI NANI) విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులు దొరికే పరిస్థితి కూడా ఉండదని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో 99 శాతం జడ్పీటీసీలు, 85 శాతం ఎంపీటీసీల్లో వైకాపా విజయం సాధించిందన్నారు. కుప్పం, నారావారిపల్లె, నిమ్మకూరులోనూ విజయం తమదేనని కొడాలి నాని చెప్పుకొచ్చారు. కుప్పంలో చంద్రబాబు(CHANDRABABU NAIDU) రాజీనామా చేసి పోటీ చేయాలని.. ఆయన గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని కొడాలి నాని సవాల్ చేశారు.
''99 శాతం జడ్పీటీసీలు, 85 శాతం ఎంపీటీసీల్లో వైకాపా గెలుపు. కుప్పం, నారావారిపల్లె, నిమ్మకూరులోనూ వైకాపాదే విజయం. జగన్‌ను ప్రజలు దీవిస్తుంటే చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో తెదేపాకు అభ్యర్థులు దొరికే పరిస్థితి ఉండదు. కుప్పంలో చంద్రబాబును తప్పక ఓడిస్తాం. కుప్పంలో చంద్రబాబు గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా'' - కొడాలి నాని, పౌరసరఫరాల శాఖ మంత్రి
ఇదీ చదవండి: