కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. విజయవాడలో పర్యటించిన ఆయన... భాజపా నేతలతో ఆత్మీయ సమావేశం అనంతరం ఇంద్రకీలాద్రిని సందర్శించారు. వేదపండితులు దివ్యాశీర్వచనాలు, అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వానికి అమ్మావారి ఆశీస్సులు ఉండాలని, దేశ ప్రజలంతా సుభిక్షంగా ఉండేలా చూడాలని అమ్మవారిని కోరుకున్నట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు.
ఇదీ చూడండి:జియోతో పోటీకి బీఎస్ఎన్ఎల్ రె'ఢీ'