ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా భాజపా అధికార ప్రతినిధి కిలారు దిలీప్ దిల్లీలో దీక్ష చేపట్టారు. మరికొందరు భాజపా నేతలు వారి వారి ఇళ్లల్లో నిరసనలు తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కరెంట్ చార్జీల పెరుగుదలపై ప్రశ్నించిన జగన్...అధికారంలోకి రాగానే ఎలాంటి ప్రకటన లేకుండానే చార్జీలు పెంచారన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే వినియోగదారులకు వేలకు వేలు బిల్లులు వచ్చాయని ఆరోపించారు.
ప్రభుత్వం తక్షణమే నష్ట నివారణ చర్యలు తీసుకోవాలని భాజపా తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు. ఏపీ సర్కార్.. సంపాదన అంటే పన్నులు పెంచడం, ఆస్తులు అమ్మడం అనుకుంటోందని ఆయన ఎద్దేవా చేశారు. వివిధ రకాల పన్నులను భారీగా పెంచేసిన ఏపీ సర్కార్.. ఇప్పుడు ఖరీదైన భూముల అమ్మకంపై కన్నేసిందన్నారు. మొదటి విడతగా గుంటూరు, విశాఖల్లోని స్థలాలను అమ్ముతోందని ఆరోపించారు. ఈ నిర్ణయం ఉపసంహరించుకోవాలన్నారు.