తెలంగాణ రాష్ట్రంలో భాగ్యనగరంలోని ఖైరతాబాద్ మహాగణపతి గంగమ్మ తల్లి ఒడికి చేరుకున్నారు. గత తొమ్మిది రోజులుగా భక్తుల పూజలు అందుకుని నిమజ్జనమయ్యారు. ఉదయం 8.18 గంటలకు ప్రారంభమైన శ్రీ పంచముఖ మహాగణపతి శోభాయాత్ర టెలిఫోన్ భవన్, తెలుగుతల్లి ఫ్లైఓవర్, ఎన్టీఆర్ మార్గ్‌లో ఆరు గంటలపాటు సాగింది. మహాగణపతి దర్శనం కోసం భక్తులు భారీగా వచ్చారు. మహాగణపతికి ట్యాంక్‌బండ్‌పై గంటపాటు పూజలు చేశారు. అనంతరం మహా గణపతిని జలప్రవేశం చేయించారు.
ఏటా ప్రత్యేకమైన అవతారంలో భక్తులకు దర్శనమిచ్చే ఖైరతాబాద్ గణేశుడు ఈసారి శ్రీ పంచముఖ రుద్ర మహాగణపతిగా (sri Panchamukha Rudra Maha ganapati) భక్తులకు దర్శనమిచ్చారు. కొవిడ్ వల్ల గతేడాది ఉత్సవాలు నిరాడంబరంగా నిర్వహించినప్పటికీ... ఈసారి భారీగా ఏర్పాట్లు చేసింది ఉత్సవ కమిటీ. ఈ ఏడాది గణపతి విగ్రహం ఎత్తును 40 అడుగులకే పరిమితం చేశారు. గత తొమ్మిది రోజుల్లో గణపతిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా వచ్చారు.
వచ్చే ఏడాది నుంచి మట్టి వినాయకున్ని ప్రతిష్టించాలని ఖైరతాబాద్ గణేశ్ (Khairatabad Ganesh) ఉత్సవ కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మికి నిర్వాహకులు హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది 70 అడుగుల మట్టి వినాయకున్ని ప్రతిష్టించి అక్కడే నిమజ్జనం చేయనున్నట్లు కమిటీ ప్రతినిధులు ప్రకటించారు.
ఇదీ చదవండి:
Balapur laddu Auction: వేలంలో రికార్డు ధర పలికిన బాలాపూర్ లడ్డూ.. ఎంతంటే..