ETV Bharat / city

ఆలయాల్లో శివనామస్మరణ... ఇంద్రకీలాద్రి చుట్టూ గిరిప్రదక్షణ... - విజయవాడ తాజా వార్తలు

కార్తిక పౌర్ణమి సందర్భంగా... శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే నీలకంఠుణ్ని దర్శించుకునేందుకు ఆలయాలకు పోటెత్తారు. ఊసిరి చెట్ల కింద దీపాలు వెలిగించి పూజలు చేశారు. నదీలో దీపాలు వదిలారు. విజయవాడలో ఘాట్​ల వద్ద భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి పుణ్య స్నానాలు ఆచరించారు. ఇంద్రకీలాద్రి చుట్టూ గిరిప్రదక్షణ కన్నుల పండువగా సాగింది.

karthika-pournami
karthika-pournami
author img

By

Published : Nov 30, 2020, 1:15 PM IST

శివనామస్మరణతో హోరెత్తిన ఆలయాలు.. ఇంద్రకీలాద్రి చుట్టూ గిరిప్రదక్షణ

కార్తిక పౌర్ణమి భక్తులు కృష్ణానదిలో పవిత్ర స్నానాలాచరించారు. 365 వత్తులతో దీపాన్ని వెలిగించి.. నదిలో విడిచిపెట్టారు. విజయవాడలోని ఘాట్‌ల వద్దకు భక్తులను అనుమతించలేదు. అయినప్పటికీ భక్తులు పెద్ద ఎత్తున రావటంతో.. ఆంక్షలతో నదీ స్నానానికి అనుమతించారు.

విజయవాడ కనకదుర్గమ్మ వెలసిన ఇంద్రకీలాద్రి చుట్టూ గిరిప్రదక్షణ కార్యక్రమాన్ని దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం పాలకమండలి, ఆలయ సిబ్బంది నిర్వహించారు. కార్తిక పౌర్ణమి, సోమవారం ఉదయం ఆరు గంటలకు ఈ గిరి ప్రదక్షణ ప్రారంభించారు. పాలకమండలి సభ్యులు, ఆలయ ఈవో సురేష్‌బాబు సతీసమేతంగా ఈ గిరి ప్రదక్షణను లాంఛనంగా ప్రారంభించారు. అమ్మవారి ఉత్సవ మూర్తులను ప్రచార రథంలో ఉంచి.. మేళ తాళాలు, వేదమంత్రోచ్ఛారణల మధ్య గిరిప్రదక్షణ జరిగింది.

కరోనా దృష్ట్యా పరిమిత సంఖ్యలోనే భక్తులకు అనుమతించారు. భవానీ మాలధారణ చేసిన భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భవానీదీక్షధారులకు ఈసారి మాల విరమణ సమయంలో గిరిప్రదక్షణ రద్దు చేశారు. కొవిడ్‌ నిబంధనల కారణంగా భవానీ దీక్షా విరమణ నిలిపేశారు. వైరస్‌ వ్యాప్తి కారణంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు.

ఇదీ చదవండి: తక్కువ ముళ్లు... ఎక్కువ రుచి... ఉప్పు నీటిలో పెరిగే అప్పలు చేప

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.