పత్తి సేకరణ విధివిధానాలపై మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు కాటన్ కార్పొరేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నవంబరు నుంచి పత్తి కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించినట్లు కన్నబాబు వెల్లడించారు. సీఎం యాప్ ద్వారా రాష్ట్రంలోని పత్తి కొంటామన్నారు. 50 ఏఎంసీలు, 73 జిన్నింగ్ మిల్స్ ద్వారా పత్తి కొనుగోలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. గతేడాది ఏ సమస్యలూ లేకుండా సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు చేశామని..ఈ ఏడాది కూడా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా పత్తి కొనుగోలు చేస్తామన్నారు. ఏఎంసీలు, జిన్నింగ్ మిల్స్ వద్ద దళారులు లేకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు.
నవంబర్ నుంచి పత్తి కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారు. సీఎం యాప్ ద్వారా రాష్ట్రంలోని పత్తి కొంటాం.. 50 ఏఎంసీలు, 73 జిన్నింగ్ మిల్స్ ద్వారా పత్తి కొనుగోలు చేస్తాం.. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా పత్తి కోనుగోలు చేస్తాం.. గతేడాది ఏ సమస్యలూ లేకుండా సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లు జరిగాయి.. ఏఎంసీలు, జిన్నింగ్ మిల్స్ వద్ద దళారులు లేకుండా చర్యలు తీసుకుంటాం. -కన్నబాబు, వ్యవసాయ శాఖ మంత్రి
ఇదీ చదవండి
TAX COLLECTION APP LAUNCH: గ్రామాల్లో ఇంటిపన్ను వసూలుకు ప్రత్యేక యాప్