తెలంగాణలో యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మామిడికుంట తండాలో కాళేశ్వరం కాలువ నిర్మాణంలో భాగంగా బాంబ్ బ్లాస్టింగ్ చేశారు. ఆ రాళ్లు వచ్చి తండాలోని ఓ ఇంటిస్లాబ్పై పడి.. స్లాబ్ కూలిపోయింది. బాంబు పేలిన సమయంలో తండా ప్రజలు వ్యవసాయ పనులపై వెళ్లడం వల్ల ప్రమాదం తప్పిందని ఊపిరిపీల్చుకున్నారు. తమ ఇంటి స్లాబ్పై రాయి పడి.. పెద్ద రంధ్రం పడినప్పుడు ఇంట్లో పిల్లలు, కోడళ్లు అక్కడ లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పిందని బాధితుడు నునావత్ దశరథ్ అన్నారు.
ఇప్పటికే ఈ కాలువ నిర్మాణం వల్ల తాము భూములు కోల్పోతున్నామని.. ఇంతవరకు నష్ట పరిహారం ఇవ్వలేదని బాధితులు వాపోతున్నారు. ఇప్పుడు ఇలా బ్లాస్టులు జరిపి తండావాసులను భయాందోళనకు గురి చేస్తున్నారని.. వారికి ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు. బ్లాస్టింగ్ నిర్వహించేటప్పుడు సమీప ప్రాంతాల్లో ప్రజలకు సమాచారమివ్వాలని.. అప్పుడే వారు జాగ్రత్తలు పాటిస్తారని తండావాసులు కోరారు.
ఇదీ చూడండి. కరోనా సోకినా... లక్షణాల్లేకుంటే 17 రోజులయ్యాక పనుల్లోకి