ETV Bharat / city

రాష్ట్రంలో వలసలు ఎందుకు పెరిగాయో జగన్ సమాధానం చెప్పాలి: కాలవ

author img

By

Published : Jan 30, 2021, 3:08 PM IST

వైకాపా అధికారం చేపట్టిన 20 నెలల నుంచి రాష్ట్రంలో వలసలు ఎందుకు పెరిగాయో ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ప్రజలు వాస్తవాలు గ్రహించి.. పంచాయతీ ఎన్నికల్లో తెదేపా బలపరిచే అభ్యర్థుల్ని గెలిపించాలని కోరారు.

రాష్ట్రంలో వలసలు ఎందుకు పెరిగాయో జగన్ సమాధానం చెప్పాలి: కాలవ
రాష్ట్రంలో వలసలు ఎందుకు పెరిగాయో జగన్ సమాధానం చెప్పాలి: కాలవ

నవరత్నాల అమలు పేరుతో ప్రజల్ని దారుణంగా మోసం చేస్తున్నారని కాలవ శ్రీనివాసులు అన్నారు. వైకాపా ప్రభుత్వ పెద్దలంతా పేదల వ్యతిరేకులేనని విమర్శించారు. అన్ని వర్గాల ప్రజలూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

'పేదల సంక్షేమానికి బాటలు వేస్తే ఆంధ్రప్రదేశ్​లో బతకలేక వేలాది మంది పొరుగు రాష్ట్రాలకు ఎందుకు వలస వెళ్తున్నారు. భవన నిర్మాణ కార్మికులు, వలస కూలీలు అర్ధాకలితో అలమటిస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ. పేదలకు ఇళ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ఎందుకు ముందుకు రావట్లేదు. 2014లో తెదేపా అధికారం చేపట్టేనాటికి 34లక్షల మందికి ఫించన్ అందుతుంటే, ఆ సంఖ్యను 54 లక్షలకు పెంచాం. 20 నెలల్లో పింఛన్​ తీసుకునే లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. రూ.200 ఫించన్​ను తెదేపా రూ.2వేలు చేసింది. రూ.3వేలు ఫించన్ ఇస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన జగన్ కేవలం రూ.250మాత్రమే పెంచి పథకం అమలును ప్రహసనంగా మార్చారు.' అని కాలవ విమర్శించారు.

దాదాపు 20లక్షలకు పైగా రేషన్ కార్డులు తొలగించారు. నిత్యవసరాలకు ప్రభుత్వం సబ్సిడీలు తగ్గించటం వల్ల కందిపప్పు, పంచదార వంటి ధరలు పెరిగి ప్రజలపై రూ.750కోట్ల అదనపు భారం పడింది. పంచదార సబ్సిడీలు నిత్యవసరాలకు తగ్గించటం వల్ల కందిపప్పు, పంచదార ధరలు పెరిగి 750 కోట్ల అదనపు భారం ప్రజలపై పడింది. ప్రభుత్వ పథకాల అమల్లో చిత్తశుద్ధి ఉంటే సామాన్య, దిగువ మధ్యతరగతి కుటుంబాలపై ఇంత భారం ఎలా పడింది.

- కాలవ శ్రీనివాసులు, తెదేపా నేత

ఇదీ చదవండి: అయిదేళ్లలో 60% పెరిగిన రాష్ట్ర నికర ఉత్పత్తి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.