ETV Bharat / city

రాష్ట్రంలో అమలయ్యేది ఐపీసీనా.. జగన్ పీనల్ కోడా?: చంద్రబాబు

author img

By

Published : Jan 21, 2021, 10:36 AM IST

Updated : Jan 21, 2021, 11:53 AM IST

రాష్ట్రంలో జరిగే అరాచకాలు ఉన్మాది పాలనను తలపిస్తున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. కళా వెంకట్రావు చేసిన తప్పేంటి అని ఆయన ప్రశ్నించారు. న్యాయమూర్తులు మారినంత మాత్రాన న్యాయం మారదని.. స్థానిక ఎన్నికలపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో స్పందించారు.

రాష్ట్రంలో అమలయ్యేది ఐపీసీనా.. జగన్ పీనల్ కోడా?: చంద్రబాబు
రాష్ట్రంలో అమలయ్యేది ఐపీసీనా.. జగన్ పీనల్ కోడా?: చంద్రబాబు
రాష్ట్రంలో అమలయ్యేది ఐపీసీనా.. జగన్ పీనల్ కోడా?: చంద్రబాబు

రాష్ట్రంలో జరిగే అరాచకాలు ఉన్మాది పాలనను తలపిస్తున్నాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. కళా వెంకట్రావు అరెస్టు ఘటనపై చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కళా వెంకట్రావు చేసిన తప్పేంటి? అని డీజీపీ గౌతం సవాంగ్‌ను ప్రశ్నించారు. రాముడి విగ్రహం ధ్వంసం చేసిన 5 రోజుల తర్వాత రామతీర్థం వెళ్లిన.. విజయసాయిరెడ్డిని ఏ చట్టం కింద రామతీర్థానికి అనుమతించారన్నారు. శాంతిభద్రతలు పరిరక్షించే విధానం ఇదేనా.. డీజీపీ చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. కళా వెంకట్రావుపై అక్రమ కేసులు నమోదు చేశారన్నారు.

చరిత్ర హీనులుగా మిగలొద్దు

"ఒక క్రైస్తవుడు.. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హిందూ దేవాలయాలపై దాడులు జరగకుండా చూసే బాధ్యత లేదా" అని చంద్రబాబు ధ్వజమెత్తారు. కళా వెంకట్రావు, దేవినేని ఉమా ఘటనలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చామన్నారు. ప్రతి పోలీసుస్టేషన్ లో ఇదే చరిత్ర పునరావృతం అవుతుందని చంద్రబాబు విమర్శించారు. తెదేపా ప్రభుత్వంలో ప్రస్తుత డీజీపీ మంచిగానే పనిచేశారని.. పదవి కాపాడుకోవడం కోసం చరిత్ర హీనులుగా మిగలొద్దని హితవుపలికారు. కళా వెంకట్రావు పై పెట్టిన సెక్షన్లే తనపైనా పోలీసులు పెట్టారని.. వాటికి తాను స్పందించాల్సిన పనిలేదని తేల్చిచెప్పారు.

మీ ఆటలు సాగవు

'ఓటు బ‌్యాంకు రాజకీయాల కోసం కుట్ర జరుగుతోంది. ప్రవీణ్ చక్రవర్తి ఎక్కడున్నారో పోలీసులు చెప్పాలి. రాష్ట్రంలో బలవంతంగా మతమార్పిడులు జరుగుతున్నాయి. కళా వెంకట్రావును అర్ధరాత్రి అరెస్టు చేస్తారా? ఇష్టం వచ్చినట్లు చేద్దామంటే మీ ఆటలు సాగవు.' అని చంద్రబాబు హెచ్చరించారు.

ప్రశ్నిస్తే.. కేసులా?

నిన్న దేవినేని ఉమను అరెస్టు చేసి అనేక స్టేషన్లకు తిప్పారని చంద్రబాబు మండిపడ్డారు. ఇంటికి వచ్చి కొడతామన్న మంత్రులపై చర్యలు తీసుకోరా? అని ప్రశ్నించారు. సీఎం, హోంమంత్రి, డీజీపీ ఒకే మతం వాళ్లయితే ఏమవుతుందన్నారు. ఆలయాలపై 145 దాడులు జరిగాయి.. ఏం చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. దాడులు జరిగాయని చెప్పేవారిపై కేసులు పెడతారా? అని అడిగారు.

మతాన్ని వాడుకుంటున్నారు

కోర్టులు చీవాట్లు పెట్టినా మీకు లెక్కలేదా?. ఐపీసీ అమలు చేస్తున్నారా.. వైకాపా కోడ్ అమలు చేస్తున్నారా... అంబేడ్కర్‌ రాజ్యాంగం కాదని రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తారా? తిరుపతిలో ధర్మపరిరక్షణ యాత్రకు అనుమతిచ్చి ఎలా రద్దు చేస్తారు?. సీఎం క్రైస్తవుడు కనుక బలవంతపు మతమార్పిళ్లు జరుగుతున్నాయనడం తప్పా? క్రైస్తవ సంఘాలతో నాకు వ్యతిరేకంగా మాట్లాడిస్తున్నారు. ఓటుబ్యాంకు రాజకీయాల కోసం మతాన్ని వాడుకుంటున్నారు. పాస్టర్‌ ప్రవీణ్‌ చక్రవర్తి ఎవరింట్లో ఉన్నారో పోలీసులు చెప్పాలి.

- చంద్రబాబు, తెదేపా అధినేత

వారు మారినంత మాత్రాన... న్యాయం మారదు..

న్యాయమూర్తులు మారినంత మాత్రాన న్యాయం మారదని చంద్రబాబు స్పష్టంచేశారు. ఎన్నికల సంఘం కూడా అనవసరం అనే రీతిలో జగన్ వ్యవహరించారన్న చంద్రబాబు... రానున్న రోజుల్లో పార్లమెంట్, అసెంబ్లీ కూడా వద్దంటారేమోనని విమర్శించారు. ఏ రాజ్యాంగ వ్యవస్థపైనా గౌరవం లేని వ్యక్తి జగన్ అని మండిపడ్డారు. కరోనా వేళ ఎన్నికలు నిర్వహించాలని చూశారన్న చంద్రబాబు.. కరోనా తగ్గాక ఎన్నికలు పెడుతుంటే వద్దంటున్నారని ఆగ్రహించారు. అమరావతిలో ఇన్​సైడర్ ట్రేడింగ్​పై చేసిన ఆరోపణలు ఏమయ్యాయని.. చంద్రబాబు ప్రశ్నించారు. గుడివాడలో పేకాట శిబిరాలపై దాడిలో పాల్గొన్న ఎస్సై మరణం అనుమానాస్పదమేనన్న ఆయన.. అసలు వాస్తవాలు కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తిరుపతిలో ధర్మ పరిరక్షణ యాత్ర ఎందుకు జరగదో తాము చూస్తామని తేల్చిచెప్పారు.

ఇదీ చదవండి:

ఎస్‌ఈసీ రిట్‌ పిటిషన్‌పై నేడు హైకోర్టు తీర్పు

Last Updated : Jan 21, 2021, 11:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.