ఉచిత ఇసుకను రద్దు చేసి లోపభూయిష్టమైన వ్యవస్థను తెచ్చారని కళా వెంకట్రావు విమర్శించారు. వేలల్లో చెల్లించినా సరైన ఇసుక అందుతుందన్న నమ్మకం లేదని పేర్కొన్నారు. అధికార పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలే ఇసుక రీచుల కేటాయింపులో గొడవకు దిగారని ఆరోపించారు. గ్రానైట్ వ్యాపారాలు ఉన్న ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు పెట్టి వేధించారని కళా తెలిపారు. రూ.కోట్లలో జరిమానాలు విధించి ఆ వ్యాపారాలను వైకాపా నేతలే హస్తగతం చేసుకుంటున్నారని విమర్శించారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 4,622 కరోనా కేసులు నమోదు