విజయవాడ నగర పాలక సంస్థ మరో ముందడుగు వేస్తోంది. రవాణా, పార్కింగ్ , కాలువల ఆధునికరణ లాంటి అంశాల్లో జర్మనీ హ్యాంబర్గ్ నగరంలో అమలు చేస్తోన్న విధానాలను అమలుచేసేందుకు అడుగులు వేస్తోంది. హ్యాంబర్గ్ నగరానికి చెందిన ప్రతినిధులు నగరంలో పర్యటించి ఇక్కడ సమస్యలను అధ్యయనం చేసి ఒక ప్రణాళిక సిద్ధం చేయనున్నారు. అనంతరం అందుకు అనుగుణంగా కార్యచరణ రూపొందించనున్నారు.
అంతర్జాతీయ అర్బన్ సంస్థ సహకారంలో భాగంగా దేశంలోని 12 రాష్ట్రాల్లో 12 నగరపాలక సంస్థలను ఎంపిక చేశారు. అందులో భాగంగా విజయవాడలో జర్మన్ సాంకేతికతను ఉపయోగించి పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టనున్నారు. రెండు నగరాలు పరస్పరం తమ ఆలోచనలు, పద్ధతులను మార్చుకోవడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అంతర్జాతీయ అర్బన్ సహకార ప్రాజెక్ట్ బృందం ప్రతినిధి తెలిపారు. స్థానిక ప్రణాళిక తయారు చేసి మెరుగైన రవాణా, పార్కింగ్ వంటి వాటిలో ఉత్తమ పద్ధతులను అవలంబిస్తామని వెల్లడించారు.
ఇది కూడా చదవండి.