Pawan Kalyan on Water Tax: నీటి తీరువా వసూలును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఖండించారు. నీటి తీరువా వసూలు విషయంలో ప్రభుత్వానిది అప్రజాస్వామ్యతీరని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల వారీగా టార్గెట్ పెట్టి మరీ నీటిపన్నులు వసూలు చేస్తున్నారని దుయ్యబట్టారు. చిన్నసముద్రం అనే చిన్నగ్రామానికి రూ.29 లక్షలు టార్గెట్ పెట్టారని విమర్శించారు. 2018 నుంచి లెక్కగట్టి 6 శాతం వడ్డీతో వసూలు చేయటం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌రెడ్డి పాలన చేస్తున్నారా?, వడ్డీ వ్యాపారం చేస్తున్నారా? అని ప్రశ్నించారు. ఆస్తిపన్ను చెల్లించలేదని గతనెలలో ఇళ్లకు తాళాలు వేశారని...నెలలు గడిచినా రైతులకు ధాన్యం డబ్బులు చెల్లించలేదని దుయ్యబట్టారు.
ఇదీ చదవండి : ఇతర రాష్ట్రాలతో పోలిస్తే... మన దగ్గరే విద్యుత్ కోతలు తక్కువ - మంత్రి పెద్దిరెడ్డి