"కోటి రూపాయలు దాటితే.. రివర్స్ టెండరింగ్‌కు పిలుస్తామని చెప్పిన ముఖ్యమంత్రి జగన్.. విజయవాడ దుర్గ గుడిలో పచారీ సరుకుల కోసం ఈవో సురేశ్ రూ. 50 కోట్లు చెల్లిస్తే ఎందుకు రివర్స్ టెండరింగ్ పిలవడం లేదు?" అని జనసేన నేత పోతిన మహేశ్ ప్రశ్నించారు. దుర్గమ్మ ఆలయంలో అవినీతి రాజ్యమేలుతోందన్నారు. ఇటీవల అనిశా దాడులు మూణ్నాళ్ల ముచ్చటే అని ఎద్దేవా చేశారు.
దుర్గ గుడిలో దండుపాళ్యం గ్యాంగ్ తిరుగుతోందని.. ఈవో సురేశ్ బాబు, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అవకతవకలకు పాల్పడుతున్నారని పోతిన మహేష్ ఆరోపించారు. పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన ఉద్యోగులు తప్పించుకుని.. చిన్న ఉద్యోగులను అనిశా దాడులతే బలి చేశారని వ్యాఖ్యానించారు. దేవాదాయశాఖ అనుమతి లేకుండా రూ.50 కోట్లతో సరుకులు ఎలా కొనుగోలు చేశారో చెప్పాలన్నారు.
ఇదీ చదవండి: