Janasena leader Arrest: రాష్ట్రవ్యాప్తంగా పవన్ కల్యాణ్ పుట్టినరోజు వేడుకలను అభిమానులు, జనసేన కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. విజయవాడలో మాత్రం జనసేన కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
విజయవాడ వన్ టౌన్ జెండా చెట్టు సెంటర్ సమీపంలో జనసేన దిమ్మని కొందరు వైకాపాకు చెందిన వ్యక్తులు తొలగించే ప్రయత్నం చేశారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న జనసేన కార్యకర్తలు వారితో గొడవకు దిగి ప్రతిఘటించారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలో దిగారు. జనసేన కార్యకర్తలను అక్కడి నుంచి పంపే ప్రయత్నం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ పోలీసులను ప్రశ్నించారు. దాంతో పోలీసులు, జనసేన కార్యకర్తల మధ్య తోపులాట నెలకొంది. పోలీసులు పోతిన మహేష్‌ను అదుపులో తీసుకుని.. వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు కుట్రతోనే జనసేన పార్టీ దిమ్మలకు రంగులు పూయడం, తొలగించడం చేస్తున్నారంటూ మహేష్ ఆరోపించారు. దీనిపై ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళన కార్యక్రమం చేపడతామని ఆయన హెచ్చరించారు.
ఇవీ చదవండి:
- రాష్ట్ర పునఃనిర్మాణానికే ప్రాధాన్యం: చంద్రబాబు
- తీస్తా సెతల్వాద్‌కు మధ్యంతర బెయిల్.. పాస్‌పోర్ట్ సమర్పించాలని సుప్రీం ఆదేశం
- HBD Pawan Kalyan: పవర్‌స్టార్ మెచ్చిన పుస్తకాలు తెలుసా?