ETV Bharat / city

Janasena Serious on Police: విజయవాడలో ఫ్లెక్సీల వివాదం.. జనసేన కార్యకర్తల ఆగ్రహం - జనసేన పార్టీ ఫ్లెక్సీల తొలగింపుపై కార్యకర్తల ఆగ్రహం

Janasena Serious on Police: విజయవాడలో జనసేన ఫ్లెక్సీల తొలగింపుపై వివాదం నెలకొంది. పోలీసుల తీరుపై ఆ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతల ఒత్తిడితో ఫ్లెక్సీలు తొలగిస్తున్నారని మండిపడ్డారు.

Janasena Serious on Police
విజయవాడలో జనసేన కార్యకర్తల ఆగ్రహం
author img

By

Published : Mar 13, 2022, 12:25 PM IST

Updated : Mar 13, 2022, 1:33 PM IST

విజయవాడలో ఫ్లెక్సీల వివాదం.. జనసేన కార్యకర్తల ఆగ్రహం

Janasena Serious on Police: జనసేన ఆవిర్భావ సభ కోసం..విజయవాడ కనకదుర్గ వారధిపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించడంపై జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ శ్రేణులు పెద్దఎత్తున వారిధిపైకి రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు, ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఆ పార్టీ నేతలు నినాదాలు చేశారు. పార్టీ ఫ్లెక్సీని తొలగించడంపై మండిపడ్డారు.

ఫ్లెక్సీని ఎలా తొలగిస్తారంటూ జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్‌ పోలీసులను నిలదీశారు. అధికార పార్టీ నేతల ఒత్తిడితో ఫ్లెక్సీలు తొలగిస్తున్నారని మండిపడ్డారు.

రేపు ఆవిర్భావ సభ..

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటంలో రేపు (సోమవారం) జనసేన ఆవిర్భావ సభ జరుగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. పార్టీ ముఖ్యనేత నాదెండ్ల మనోహర్ దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసే లక్ష్యంతో ఈ సభను నిర్వహిస్తున్నట్లు మనోహర్‌ తెలిపారు. రాజకీయంగా జనసేన వైఖరిని ఇదే వేదిక నుంచి పవన్ కల్యాణ్ ప్రకటిస్తారని వెల్లడించారు.

ఆవిర్భావ సభ కోసం ప్రత్యేకంగా రూపొందించిన 'జన జన జన జనసేనా' అనే గీతాన్ని, గోడ పత్రికనూ ఆయన ఆవిష్కరించారు. సభా ప్రాంగణానికి మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య చైతన్య వేదిక అని పేరు పెట్టినట్లు తెలిపారు. ఆవిర్భావ సభ ఏర్పాట్లను పవన్‌ కల్యాణ్‌ సోదరుడు కొణిదెల నాగబాబు పరిశీలించారు.

ఆవిర్భావ సభ నిర్వాహణ కమిటీల్లో నియామకాలు..

జనసేన ఆవిర్భావ సభ నిర్వాహణ కమిటీల్లో మరో 31 మందిని నియమించినట్లు నాదెండ్ల మనోహర్‌​ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా సమన్వయ కమిటీలో 8 మంది, సెక్యూరిటీ కమిటీలో11 మంది, మీడియా కో ఆర్డినేటర్​ కమిటీలో ఆరుగురు, వాలంటీర్ల కమిటీలో ముగ్గురు, మెడికల్​ అసిస్టెన్స్, ప్రచార కమిటీలో ఒక్కొక్కరి చొప్పున నియమించారు.

ఇదీ చదవండి:

Chandrababu Tour: రేపు జంగారెడ్డిగూడెంకు చంద్రబాబు.. నాటుసారా మృతుల కుటుంబాలకు పరామర్శ

Last Updated : Mar 13, 2022, 1:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.