రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా న్యాయపోరాటం చేసేందుకు జై భీమ్ యాక్సెస్ జస్టిస్ సిద్ధంగా ఉంటుందని ఆ సంస్థ కన్వీనర్, మాజీ న్యాయమూర్తి జె.శ్రావణ్‌కుమార్ తెలిపారు. విజయవాడలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేసంలో పాల్గొన్న ఆయన... బాధితులకు అండగా నిలస్తామన్నారు. దళితులపై జరిగిన దాడుల కేసుల్లో న్యాయం జరగటం లేదని ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. చీరాల యువకుడు కిరణ్ కేసు విచారణకు వచ్చే సమయానికి ఉపసంహరించుకున్నారని... అందువల్ల ఆ కేసులో తానే పిల్ వేయాల్సి వచ్చిందని మాజీ ఎంపీ హర్షకుమార్ తెలిపారు. అనపర్తిలో అంబేడ్కర్ విగ్రహం పెట్టినందుకు జైల్లో వేశారన్నారు. రైలు దహనం ఘటనలో కాపులపై కేసులు ఎత్తివేసిన ప్రభుత్వం... దళితులపై ఉన్న ఒక్క కేసునూ ఎత్తివేయలేదని ఆరోపించారు. దళితులపై ఉన్న కేసుల జాబితాను సీఎం జగన్‌కు పంపినా ఇంతవరకు చర్యలు లేవని మండిపడ్డారు.
డాక్టర్ సుధాకర్‌పై అక్రమ కేసులు పెట్టి ఆయన్ని ఇబ్బందులకు గురిచేశారని డాక్టర్ అనితా రాణి వ్యాఖ్యనించారు. తమకు పోలీసుల నుంచి రక్షణ లేకుండా పోయిందని వాపోయారు. దళితులపై దాడులు జరిగితే వాటిని పక్కదారి పట్టిస్తున్నారన్నారని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి దాడులను అరికట్టకపోతే తమ పోరాటం తీవ్రతరం చేస్తామని వక్తలు హెచ్చరించారు.
ఇదీచదవండి