కేంద్ర మాజీ మంత్రి, స్వర్గీయ జైపాల్ రెడ్డి అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి స్వయంగా పర్యవేక్షించనున్నారు. అంతిమయాత్ర, అంత్యక్రియల్లో పాండిచ్చేరి ముఖ్యమంత్రి నారాయణ స్వామి, కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు మల్లిఖార్జున ఖర్గే, గులాంనబీ ఆజాత్‌లతోపాటు పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొననున్నారు. భారీ సంఖ్యలో నేతలు వచ్చే అవకాశం ఉన్నందున పోలీసు శాఖ కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది.
అంతిమయాత్ర సాగుతుందిలా...
ఉదయం 9 గంటలకు జూబ్లిహిల్స్‌లోని ఆయన నివాసం నుంచి ప్రారంభమయ్యే అంతిమయాత్ర 10 నుంచి 10.30గంటల ప్రాంతంలో గాంధీభవన్ చేరుకుంటుంది. అక్కడ జైపాల్ రెడ్డి పార్థివదేహాన్ని గంట నుంచి గంటన్నరపాటు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల సందర్శనార్థం ఉంచుతారు. అనంతరం అక్కడ నుంచి ప్రారంభమయ్యే అంతిమయాత్ర...నేరుగా నెక్లస్ రోడ్డులోని పీవీఘాట్ వద్దకు చేరుకుంటుంది. అంత్యక్రియలు పూర్తియ్యేప్పటికి మధ్యాహ్నం ఒంటిగంట కావచ్చని అధికారులు భావిస్తున్నారు.
ఇవీ చూడండి: జననేత జైపాల్ రెడ్డికి అశ్రునివాళి