జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలను.. విశ్వవిద్యాలయ, ప్రభుత్వ పీజీ కళాశాలలకు మాత్రమే పరిమితం చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2020-21 ఆర్ధిక సంవత్సరానికి గానూ ఈ రెండు పథకాలు ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో.. కన్వీనర్ కోటాలో అడ్మిషన్లు పొందిన వారికి మాత్రమే పరిమితం చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శి బి.రాజశేఖర్ ఉత్తర్వలు జారీ చేశారు.
కన్వీనర్ కోటా, సెల్ఫ్ ఫైనాన్స్‌లో అడ్మిషన్లు పొందిన ప్రైవేట్ ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ డిగ్రీ, పీజీ కళాశాలలకు ఈ రెండు పథకాలు వర్తించవని స్పష్టం చేసింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాల్సిందిగా ఏపీ సీఎఫ్ఎస్ఎస్ సీఈఓకు సూచనలు జారీ చేసింది.
ఇదీ చదవండి: