ETV Bharat / city

Jagan Cases: జగన్ డిశ్చార్జ్ పిటిషన్‌పై వాదనలు నవంబరు 1కి వాయిదా

author img

By

Published : Oct 28, 2021, 7:12 PM IST

హైదరాబాద్​ సీబీఐ, ఈడీ కోర్టుల్లో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ జరిగింది. జగతి పబ్లికేషన్స్ డిశ్చార్జ్ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేసిన సీబీఐ.. విజయసాయి డిశ్చార్జ్ పిటిషన్‌పై కౌంటరుకు మళ్లీ గడువు కోరింది. ఓబులాపురం మైనింగ్ కేసులో డిశ్చార్జ్ పిటిషన్‌పై ఐఏఎస్ శ్రీలక్ష్మి సీబీఐ కోర్టులో వాదనలు కొనసాగించారు.

Jagan Cases
Jagan Cases

హైదరాబాద్​ సీబీఐ, ఈడీ కోర్టుల్లో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ జరిగింది. ఇండియా సిమెంట్స్ కేసులో దర్యాప్తు పూర్తయిందన్న ఈడీ.. జగన్ డిశ్చార్జ్ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలుకు మరోసారి గడువు కోరింది. జగతి పబ్లికేషన్స్ డిశ్చార్జ్ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేసిన సీబీఐ.. విజయసాయి డిశ్చార్జ్ పిటిషన్‌పై కౌంటరుకు మళ్లీ గడువు కోరింది. వాదనలు విన్న న్యాయస్థానం.. ఇందూ ప్రాజెక్ట్ కేసులో జగన్ డిశ్చార్జ్ పిటిషన్‌పై వాదనలు నవంబర్‌ 1కి, రఘురాం సిమెంట్స్ కేసులో విచారణను నవంబర్‌ 5కు వాయిదా వేసింది.

తెలంగాణ మంత్రి సబిత, నిమ్మగడ్డ డిశ్చార్జ్ పిటిషన్లపైనా విచారణను వాయిదా వేసింది. ఓబులాపురం మైనింగ్ కేసులో డిశ్చార్జ్ పిటిషన్‌పై ఐఏఎస్ శ్రీలక్ష్మి సీబీఐ కోర్టులో వాదనలు కొనసాగించారు. వాదనలు విన్న న్యాయస్థానం.. విచారణ నవంబర్‌ 2కు వాయిదా వేసింది.

తెలంగాణ హైకోర్టులోనూ విచారణ..
జగన్ అక్రమాస్తుల కేసుల పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులోనూ ఇవాళ విచారణ జరిగింది. హెటిరో డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై న్యాయస్థానం విచారించింది. జగన్ అక్రమాస్తుల కేసులో తనను సీబీఐ అనవసరంగా ఇరికించిందన్న శ్రీనివాసరెడ్డి.. కేసు నుంచి తన పేరును తొలగించాలని కోరారు. వాదనలు విన్న తెలంగాణ ఉన్నత న్యాయస్థానం.. జగన్ కేసుల పిటిషన్లన్నింటిపై విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

ఇదీ చదవండి

AP Cabinet decisions : కొత్తగా 4 వేల ఉద్యోగాలు.. ఆన్​లైన్​లో సినిమా టికెట్లు.. అమ్మఒడికి అది తప్పనిసరి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.