విజయవాడ బెంజ్ సర్కిల్లోని వేదిక కల్యాణ మండపాన్ని అమరావతి పరిరక్షణ సమితి ప్రధాన కార్యాలయంగా జేఏసీ నేతలు నిర్ణయించారు. ప్రైవేటు సమావేశ మందిరాలు, హోటళ్లలో సమావేశాలను ఇంతవరకు నిర్వహిస్తున్న సమితి ప్రతినిధులు.... ఇప్పుడు ఈ కార్యాలయంలో సమావేశాలు నిర్వహించనున్నారు. రాజధాని అమరావతిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి కచ్చితమైన పరిష్కారం వచ్చేంత వరకూ ఆందోళన కొనసాగించాలని తీర్మానించారు. వేదిక కల్యాణ మండపంలో అన్ని పార్టీల నేతలు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించిన అనంతరం ఐకాస ప్రతినిధులు ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. అన్ని లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోనూ పర్యటించే ఐదు బృందాల బస్సు యాత్రను తెదేపా అధినేత చంద్రబాబుతోపాటు ఇతర పార్టీల ముఖ్యనేతలు ఇక్కడి నుంచే ప్రారంభించబోతున్నారు.
ఇదీ చదవండి: