కరోనా వ్యాప్తితో లాక్డౌన్ విధించిన కారణంగా.. అనేక మంది ఉపాధి కోల్పోయారు. ఇలాంటి వారికి.. విజయవాడలో ఇస్కాన్ సంస్థ అన్నప్రసాదాలు పంచిపెట్టింది. నిరుపేదలకు, నిరాశ్రయులకు నిత్యం అన్నదానం చేస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
లాక్ డౌన్ ప్రారంభమైన రోజు నుంచి నిరాశ్రయులకు ఆహారాన్ని సరఫరా చేస్తున్నామని తెలిపారు. దేశ వ్యాప్తంగా సుమారు 2 కోట్ల 63 లక్షల మందికి నిత్యం అన్నప్రసాదాన్ని ఇస్కాన్ సంస్థ అందజేస్తుందని వివరించారు.
ఇదీ చదవండి: