రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేస్తామని నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్ అన్నారు. 2022 నాటికి పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం చేయాలన్న లక్ష్యసాధనలో ఉద్యోగులు నిర్మాణాత్మక పాత్ర పోషించాలని మంత్రి కోరారు. విజయవాడలోని రైతుశిక్షణ భవనంలో నీటిపారుదల శాఖ ఎన్జీవో అసోయేషన్ రాష్ట్ర సంఘం రూపొందించిన 2021 వార్షిక డైరీని మంత్రి ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి జగన్.. రైతాంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని.. చివరి భూమి వరకు సాగునీరు అందించేందుకు చేస్తోన్న ప్రయత్నాలకు సిబ్బంది సహకరించాలని కోరారు.
ఉద్యోగ సంఘం తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల ఉద్యోగుల ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: తెదేపా నేత అంకులయ్య హత్యకు రూ.5 లక్షల సుపారీ: ఎస్పీ విశాల్ గున్నీ